Ajay Bhupathi: RX100 సినిమాతో మంచి హిట్ కొట్టి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇక ఆర్జీవీ శిషుడిగా తన ట్వీట్స్ తో కూడా పాపులర్ అయ్యాడు అజయ్. RX100 సినిమాతో కార్తికేయ, పాయల్ కెరీర్లు సెట్ అయిపోయాయి కానీ డైరెక్టర్ అజయ్ మాత్రం ఆ తర్వాత సినిమా తీయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు.
చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్, సిద్దార్థ్ లని హీరోలుగా పెట్టి మహా సముద్రం అనే సినిమాని తీశాడు అజయ్. విడుదలకి ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో అజయ్ భూపతి సైలెంట్ అయిపోయాడు. అప్పట్నుంచి సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టీవ్ గా ఉండట్లేదు. తన నెక్స్ట్ సినిమాని కూడా ప్రకటించలేదు.
తాజాగా అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా ఓకే చేశాడని, దానికి ‘మంగళవారం’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు, ఇప్పుటికే ఆ టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై అజయ్ భూపతి అయితే ఇప్పటివరకు స్పందించలేదు. RX100 సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడి నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు.