“బేషరమ్” సాంగ్ కాంట్రవర్సీని కాసేపు పక్కన పెట్టండి.. తాజాగా అర్జిత్ సింగ్ మ్యూజిక్ కాన్సర్ట్ కు అనుమతులు క్యాన్సిల్ అయ్యాయి. ఫిబ్రవరి 18న కోల్ కతాలో జరగాల్సి ఉండగా అనుమతులు ఇచ్చేందుకు తృణముల్ కాంగ్రెస్ సర్కారు నిరాకరించింది. జీ-20 సదస్సుకు సంబంధించిన భేటీ ఒకటి అదే ప్రాంతంలో జరుగనుందని, సెక్యూరిటీ సమస్యలు తలెత్తకుండా అర్జిత్ షోకు పర్మిషన్ ఇవ్వటం లేదని దీదీ సర్కారు చెబుతోంది. అయితే దీని వెనుక ఓ అసలు కారణం ఉందని బీజేపీ కొత్త వర్షన్ ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తోంది. “రంగ్ దే తు మోహె” (దీనర్థం నాకు కాషాయ వర్ణం పూయమని) అనే పాటను పాడటమే ఆర్జిత్ సింగ్ చేసిన తప్పంటూ బీజేపీ సోషల్ మీడియా హెడ్ అమిత్ మాలవీయ వివరిస్తున్నారు. కాషాయం హిందుత్వానికి గుర్తు కాబట్టి టీఎంసీకి ఇదంతా జీర్ణం కాలేదని బీజేపీ నయా వర్షన్ చెబుతుండటం విశేషం. బీజేపీ అంటే ఏమాత్రం సహించలేని దీదీకి అర్జిత్ పాడిన పాట ఏమాత్రం నచ్చలేదని మాలవీయ అంటున్నారు. కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొనగా అర్జిత్ ఈ పాట ఆలపించి దీదీ ఆగ్రహానికి బలవుతున్నారని మాలవీయ చెబుతుండటం అర్జిత్ ఫ్యాన్స్ కు దీదీపై కోపం తెప్పిస్తోంది. బాలీవుడ్ లో టాప్ సింగర్ అయిన అర్జిత్ కు దేశవ్యాప్తంగా లెక్కలేనంతమంది ఫ్యాన్స్ ఉన్నారుమరి.
Saffron song row: సింగర్ అర్జిత్ సింగ్ పై మమతా బెనర్జీ ఆగ్రహం, అందుకేనా షో క్యాన్సిల్?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES