Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభMEGA vs ALLU: సాయి తేజ్ ఒక్క మాటతో మళ్లీ నిప్పు రాజేశాడు!

MEGA vs ALLU: సాయి తేజ్ ఒక్క మాటతో మళ్లీ నిప్పు రాజేశాడు!

Sai Dharam Tej: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా మెగా హీరోలు, అల్లు హీరోల మధ్య నడుస్తున్న ‘అంతర్గత యుద్ధం’ మాత్రం ఆగేలా లేదు. తాజాగా, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ పలికిన ఒకే ఒక్క మాట.. సోషల్ మీడియాలో మళ్ళీ నిప్పు రాజేసింది.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ram-pothineni-andhra-king-taluka-teaser-released/

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘ది ఫాస్ట్ & క్యూరియస్ – ఆటో ఎక్స్పో 2025’ ఈవెంట్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న సాయి దుర్గా తేజ్‌కి ఒక ప్రశ్న ఎదురైంది. ఒక అభిమాని ధైర్యం చేసి, “అల్లు అర్జున్‌ గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగేశాడు.
తేజ్ కూడా కొంచెం ఇబ్బందిగా, కాస్త అయిష్టంగా ఉన్నట్టు కనిపించినా.. తప్పక మైక్ తీసుకుని బదులిచ్చారు. “అల్లు అర్జున్‌ సూపర్ యాక్టర్. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ అయిపోయారు. ఆయన చాలా గొప్పోడు అయిపోయారు. ఆయనను చూసి సంతోషంగా, గర్వంగా ఉంది.” అంటూ ఆన్సర్ ఇచ్చి.. గబగబా టాపిక్ మార్చేశారు.

తేజ్ ఈ మాటలను పైకి సానుకూలంగా చెప్పినా, ఫ్యాన్స్ మాత్రం దాన్ని ‘మెగాస్కోప్’లో పెట్టి చూడటం మొదలుపెట్టారు. బన్నీ అభిమానులు తేజ్ మాటల్లోని ‘ఆయన చాలా గొప్పోడు అయిపోయారు’ అనే పదాన్ని పట్టుకుని ట్రోలింగ్ మొదలుపెట్టారు. “నిజంగా ప్రేమ ఉంటే ఆ ఇబ్బంది ఏంటి?”, “పాన్ ఇండియా స్టార్ గురించి మాట్లాడటానికి ఎందుకీ ఇర్ష్య ?”, “ఇది హృదయం నుంచి వచ్చిన మాట కాదు, పాత కోపాన్ని దాచుకుని చెప్పినట్టు ఉంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-box-office-collections-hit-or-flop/

వివాదానికి మూలం.. ఆ ‘ఎన్నికల మలుపు’

నిజానికి, ఈ ఇద్దరు హీరోల మధ్య గ్యాప్‌ మొదలవడానికి కారణం.. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరే. పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వెళ్లకుండా, తన స్నేహితుడైన వై.ఎస్.ఆర్.సి.పి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం మెగా ఫ్యామిలీలో తీవ్ర చర్చకు దారి తీసింది. అప్పుడే, సాయి దుర్గా తేజ్, అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం ఈ వివాదానికి అధికారిక ముద్ర వేసింది.
పెద్దలంతా కలిసిపోయినా, తేజ్ నోటి నుంచి వచ్చిన ఈ తాజా కామెంట్.. మళ్లీ అభిమానుల మధ్య ‘మెగా వర్సెస్ అల్లు’ అనే ఫ్యాన్ వార్‌ను మొదలుపెట్టింది. ఇద్దరు కజిన్స్ పాజిటివ్‌గా ఉన్నా, వారి ఫ్యాన్స్ మాత్రం ఇప్పట్లో ఈ ‘కోల్డ్ వార్’ని ఆపేలా కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad