Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG Mania: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. ఓజీ ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌...

OG Mania: వేట‌కు సిద్ధ‌మైన‌ బెంగాల్ టైగ‌ర్.. ఓజీ ట్రైల‌ర్‌పై హీరో సాయి దుర్గ తేజ్‌ ట్వీట్‌

Sai Durga Tej on OG Mania: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీ రిలీజ్‌కు ముందే సంచలనాలను క్రియేట్‌ చేస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ మానియానే నడుస్తోంది. తాజాగా రిలీజైన ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో టాప్‌ ట్రెండింగ్‌ వన్‌గా నిలిచింది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ను వీక్షించిన అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. తాజాగా, సుప్రిమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్ అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. ‘మేం ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ ఇప్పుడు వేటకు బయల్దేరింది. నాతో సహా ప్రతీ అభిమాని కోరిక తీర్చిన, అందరినీ సంతృప్తి పరిచిన సుజీత్ గారికి థాంక్స్.. ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు.. నా ప్రియ మిత్రుడు తమన్ ఇచ్చిన బీజీఎం అయితే నిజంగానే ఫైర్ స్ట్రామ్. నా హీరో, నా గురువు పవన్ కళ్యాణ్ మామయ్య ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారు. స్వాగ్, స్టైల్ ఇవన్నీ కూడా ఆయనకు తప్పా ఇంకెవ్వరికీ సాధ్యం కావు అన్నట్టుగా ఉంది. ఓజీని మనమంతా కలిసి సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. విజిల్స్‌, కేకలు, అరుపులతో థియేటర్లను షేక్‌ చేసేందుకు మీతో సహా నేను కూడా సిద్దంగా ఉన్నా’ అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

- Advertisement -

పవన్ స్టార్‌ స్టైలిష్‌, స్వాగ్‌ మరో యాంగిల్‌..

ఇక, ఓజీ ట్రైలర్‌ విషయానికి వస్తే.. దర్శకుడు సుజిత్ చేసిన కట్స్, పవన్ కళ్యాణ్‌ స్టైలిష్‌, స్వాగ్‌‌ను మరో యాంగిల్‌లో చూపించడం, ఇక తమన్ బీజీఎం, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్క విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 24న పెయిడ్ ప్రీమియర్లకు ఉన్న డిమాండ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టికెట్లు అమ్ముడుపోయాయి. సుజీత్ విజన్, థమన్ సంగీతం, పవన్ కళ్యాణ్ తిరుగులేని శక్తితో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద ఒక పండుగ వాతావరణాన్ని తీసుకు వచ్చేలా ఉంది. ఈ సినిమా ద్వారా పవన్‌ కళ్యాన్‌ సునామి సృష్టించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad