SYG: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సుప్రీం హీరోగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న సాయి దుర్గ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. ఈ సినిమాను మేకర్స్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను సాయి దుర్గ తేజ్ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల దసరా కానుకగా గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు.
ఈనెల 15 న సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు. “అసుర ఆగమనానికి ముహూర్తం ఫిక్స్”.. అంటూ క్రేజీ అప్‌డేట్ ని ఇచ్చారు. మెగా అభిమానుల కోసం ప్రత్యేకించి గ్లింప్స్ ని రెడీ చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాదు, ఈ సారి మీ అంచనాలను మించి అప్‌డేట్ ఉండబోతుందని అందరిలో ఒక్కసారిగా ఆసక్తిని రేపారు.
Also Read – Suicide: ‘అమ్మ నన్ను క్షమించు’: ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం, వేధింపులే కారణమా?
ఇక తాజాగా, సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి ప్రీ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ అక్టోబర్ 15న సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా, ‘అసుర ఆగమనం’.. ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఇక, ప్రీ గ్లింప్స్ ను చూస్తే, ఒక ఊరులో ప్రజలంతా పరుగులు తీస్తున్న సీన్ తో ప్రారంభమవుతుంది. అలాగే, ఆయుధాలు సిద్ధమవుతున్నట్లుగా చూపించారు. ఈ నేపథ్యంలో చాలా పవర్ ఫుల్ గా సాయి దుర్గ తేజ్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది.
ఒక్కసారిగా విరుచుకుపడ్డ సాయి దుర్గ తేజ్.. వరుసగా ఒక్కొక్కరినీ, చంపుకుంటూ వెల్తాడు. ఓవరాల్‌గా ఈ గ్లింప్స్ మొత్తం కంప్లీట్ వైలెన్స్ తో సాగింది. ఈ నేపథ్యంలో వచ్చిన సాంగ్ చాలా స్పెషల్ గా ఉంది. మొత్తానికి, సంబరాల ఏటి గట్టు సినిమా అందరిలో క్యూరియాసిటీని బాగా పెంచేసింది. ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. విరూపాక్ష లాంటి సూపర్ హిట్ తర్వాత సాయి దుర్గ తేజ్ నుంచి రాబోతున్న సంబరాల ఏటిగట్టు సినిమా ఈసారి పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ కావడం గ్యారెంటీ అంటున్నారు. కాగా, ఈ మూవీని రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్నాడు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తుండగా, టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read – Ravi Teja: ‘మాస్ జాతర’ తర్వాత భార్యా బాధితుడిగా మాస్ మహారాజా.. టైటిల్ అదిరింది!


