Sai Pallavi: తెలుగు, తమిళ భాషల్లో హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్‌గా కొనసాగుతోంది సాయిపల్లవి. ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా అంటే హిట్టే అని నమ్ముతుంటారు ఆడియెన్స్. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటూ నవతరం హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది సాయిపల్లవి. అమరన్, తండేల్‌తో బ్లాక్‌బస్టర్స్‌తో తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో సాయిపల్లవికి ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలను కాదని బాలీవుడ్‌కు షిఫ్టయ్యింది సాయిపల్లవి. హిందీలో రెండు సినిమాలు చేస్తుంది.
ఆమిర్ ఖాన్ కొడుకు…
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏక్ దిన్ పేరుతో లాంఛ్ చేశారు. ఈ ఏడాది నవంబర్ ఫస్ట్ వీక్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
టైటిల్ ఛేంజ్…
తాజాగా సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ టైటిల్ మారింది. సినిమా రిలీజ్ కూడా పోస్ట్‌పోన్ అయ్యింది. ఈ సినిమా టైటిల్‌ను మేరే రహో (Mere Raho)గా మార్చారు మేకర్స్. ఈ సినిమా నవంబర్ 7న కాకుండా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతున్నదట. ఏక్ దిన్ అనే టైటిల్ కంటే మేరే రహో కథకు యాప్ట్ అనే ఆలోచనతో మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
థాయిలాండ్ మూవీ వన్ డేకు రీమేక్‌గా మేరే రహో తెరకెక్కుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు అపరిచితులు ఒకరోజు కలిసి జర్నీ చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? ఆ రోజు వారి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది అనే కథతో ఈ మూవీ రూపొందుతున్నట్లు సమాచారం.. విధి, ప్రేమ, నమ్మకం అనే అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మేరే రహో మూవీకి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్‌తో కలిసి మన్సూర్ ఖాన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
రామాయణలో…
మేరే రహోతో పాటు హిందీలో రామాయణ సినిమా చేస్తోంది సాయిపల్లవి. ఈ మైథలాజికల్ మూవీలో రణభీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. రామాయణ గాథతో తెరకెక్కుతున్న ఈ మూవీలో సీతగా సాయిపల్లవి నటిస్తుండగా… రాముడిగా రణభీర్‌కపూర్ కనిపించబోతున్నాడు. రావణుడి పాత్రను యశ్ పోషిస్తున్నారు. 2026 దీపావళికి రామాయణ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read- Disha Patani: దిశా పటానీ ఇంటిపై కాల్పులు – ట్రైలర్ మాత్రమే అంటూ వార్నింగ్


