Kalaimamani Award: హీరోయిన్ సాయిపల్లవికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం కలైమామణి దక్కింది. సాయిపల్లవితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, యాక్టర్ ఎస్‌జే సూర్యలను ఈ అవార్డు వరించింది. దిగ్గజ నేపథ్య గాయకుడు కేజే ఏసుదాస్…. ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డుకు ఎంపికయ్యారు.
కళా రంగంలో ప్రతిభను చాటిన వారికి…
2021, 2022, 2023 ఏడాదిలకు గాను కలైమామణి అవార్డుల విజేతలను తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఏడాదికి 30 మంది చొప్పున మొత్తం 90 మంది ప్రముఖులు కలైమామణి అవార్డులను దక్కించుకున్నారు. కళా రంగంలో ప్రతిభను చాటుకుంటున్న వారికి ఈ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా అందజేస్తుంది.
సాయిపల్లవి… లింగుసామి…
సినీ పరిశ్రమ నుంచి 2021 ఏడాదికి గాను సాయిపల్లవి, ఎస్‌జే సూర్యతో పాటు డైరెక్టర్ లింగుసామి, స్టంట్ మాస్టర్ సూపర్ సుబ్బరాయన్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2022 ఏడాదిలో హీరో విక్రమ్ ప్రభు, లిరిసిస్ట్ వివేక, జయ గుహనాథన్‌తో పాటు పీఆర్‌వో డైమండ్ బాబులకు ఈ అవార్డు దక్కింది. 2023 ఏడాదిగాను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్‌తో పాటు సింగర్ శ్వేతా మోహన్, హీరో మణికందన్, జార్జ్ మరియన్, కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్, సంతోష్ కుమార్, నిఖిల్ మురుగన్‌లు అవార్డులను దక్కించుకున్నారు.
ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డు…
దిగ్గజ నేపథ్య గాయకుడు కేజే ఏసుదాస్‌కు ఎంఎస్ సుబ్బలక్ష్మి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డు కింద బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి యేసుదాస్‌కు దక్కనుంది. అక్టోబర్‌లో ఏసుదాస్‌తో పాటు కలైమామణి విజేతలకు ప్రభుత్వం ఈ అవార్డులను అందజేయనుంది. అవార్డు ప్రదానోత్సవ ఈవెంట్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు.
గత ఏడాది విడుదలైన అమరన్ మూవీలో అసమాన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించింది సాయిపల్లవి. మరోవైపు కోలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ కొనసాగుతోన్నాడు. ఇటీవల రిలీజైన రజనీకాంత్ కూలీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.
Also Read – PK On Revanth: రేవంత్ కు బీహార్ లో ఏం పని? – పీకే సంచలన వ్యాఖ్యలు.. సీఎం పర్యటనపై రాజకీయ దుమారం!


