బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేశారు.
ఆస్పత్రి న్యూరోసర్జన్ డాక్టర్ నితిన్ డాంగే మాట్లాడుతూ సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందన్నారు. ఆయన్ను నడిపించేందుకు ప్రయత్నించగా బాగానే నడిచాడని తెఇపారు. కానీ సర్జరీల కారణంగా ఐసీయూలో ఉంచాం. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించామన్నారు. మరో వారం రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. 36 గంటల వ్యవధిలోనే నిందితుల్లో ఒకరిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. ప్రస్తుతం నిందితుడిని బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.