Sunday, June 22, 2025
Homeచిత్ర ప్రభAnushka - Ghati: విక్రమ్ ప్రభుతో పాట పాడుకున్న అనుష్క

Anushka – Ghati: విక్రమ్ ప్రభుతో పాట పాడుకున్న అనుష్క

Ghati Song – Sailore: టాలీవుడ్ బాక్సాఫీస్ క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొదిన సినిమా ‘ఘాటి’. జూలై11న మూవీని రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనుష్క స‌ర‌స‌న త‌మిళ స్టార్ విక్ర‌మ్ ప్ర‌భు న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఘాటి గ్లింప్స్‌లో అనుష్క ప‌క్కా మాస్‌, ఇంటెన్స్ అవ‌తార్‌లో క‌నిపించ‌టంతో సినిమాపై బ‌జ్ మ‌రింత‌గా పెరిగింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫోక్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ‘సైలోరే..’ అంటూ సాగే ఆ పాట ఎన‌ర్జిటిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌లా ఆక‌ట్టుకుంటోంది. విక్ర‌మ్ ప్ర‌భు పాత్ర‌లోనూ డెప్త్‌, ఇంటెన్సిటీ క‌నిపిస్తోంది.

- Advertisement -

అనుష్క ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించ‌న‌టువంటి పాత్ర‌ను ఘాటిలో పోషించింద‌ని గ్లింప్స్‌, పోస్ట‌ర్స్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతోంది. ఇక అడవుల నేప‌థ్యంలో సాగిన సైలోరే ఫోక్ సాంగ్‌లో అనుష్క‌, విక్ర‌మ్ ప్ర‌భు జంట ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తున్నారు. అనుష్క, విక్రమ్‌ కొత్తగా పెళ్లి అయిన జంటగా క‌నిపించారు. పాట‌లో చ‌క్క‌టి ఎమోష‌న‌ల్ ట‌చ్ క‌నిపిస్తుంది. నాగవెళ్లి విద్యాసాగర్ ఈ జాన‌ప‌ద స్వరాలను భావోద్వేగాలకు మిక్స్ చేసి ట్యూన్‌ను చ‌క్క‌గా కంపోజ్ చేశారు. కృష్ణ పాట‌ను చ‌క్క‌గా రాశారు. . లిప్సిక భాష్యం, సాగర్ నాగవెళ్లి, సోనీ కోమండూరి పాట‌ను పాడారు. రాజు సుందరం కొరియోగ్ర‌ఫీ చూడ‌చ‌క్కగా ఉంది. మనోజ్ రెడ్డి కటాసాని సినిమాటోగ్రఫీ అందించిన ఈ మూవీకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సాయి మాధవ్ బుర్రా మాటలు రాశారు. ఘాటి మూవీ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/bigg-boss-9-telugu-contestants/

రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఘాటి సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే రూ.12 కోట్ల వరకు బిజినెస్ చేసిందని ట్రేడ్ వ‌ర్గాలంటున్నాయి. అలాగే, ఓటీటీ మరియు ఆడియో రైట్స్ ద్వారా రూ.38 కోట్ల వరకు డీల్ క్లోజ్ అయినట్టు స‌మాచారం. అంటే మొత్తం ప్రీ-రిలీజ్ బిజినెస్ చూసుకుంటే దాదాపు రూ.50 కోట్లకు చేరిందని సమాచారం. సినిమా మేకింగ్‌కు న‌ల‌బై కోట్లు అయ్యాయ‌ని, ఆ లెక్క‌లో చూస్తే ఘాటి మూవీ టేబుల్ ప్రాఫిట్‌లో రిలీజ్ అవుతుంద‌ని అంటున్నారు సినీ జ‌నాలు. ఒక్కోసారి స్టార్ హీరోల సినిమాలకే సాధ్యపడని స్థాయిలో ఘాటి బిజినెస్ చేయడం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అనుష్క గత కొంతకాలంగా పెద్ద హిట్స్ లేకపోయినా, ఈ సినిమాకి మాత్రం మార్కెట్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News