Small Budjet Movies: ఈ ఏడాది బాక్సాఫీస్ తీరు ట్రేడ్ వర్గాలతో పాటు ఆడియెన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రిలీజైన కొన్ని సినిమాలు వందల కోట్ల వసూళ్లను రాబట్టి ప్రేక్షకుల ఊహలను తారుమారు చేశాయి. రికార్డులు ఖాయం అనుకున్న స్టార్ హీరోల సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి.
కంటెంట్ ముఖ్యం…
కంటెంట్ ఉంటే స్టార్ వాల్యూతో పనిలేకుండా ప్రేక్షకులు సినిమాను విజయవంతం చేస్తారని కొన్ని విజయాలు నిరూపించాయి. యాభై కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి నిర్మాతలకు లాభాల పంటను పండించాయి.
ఫస్ట్ హిట్…
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఈ ఏడాది టాలీవుడ్‌కు ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు వెంకటేష్. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్‌తో పోటీగా రిలీజైన ఈ మూవీ సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీని రూపొందించాడు. యాభై కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీ 303 కోట్ల కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది.
Also Read – Vande Bharat : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్!
ట్రెండ్ సెట్టర్…
మహావతార్ నరసింహా యానిమేషన్ మూవీలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా ఇప్పటికీ కలెక్షన్స్‌తో కుమ్మేస్తోంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందులోనూ యానిమేషన్ మూవీ కావడంతో నాలుగైదు కోట్లు రాబట్టడం కూడా కష్టమేనని అనుకున్నారు. కానీ మహావతార్ నరసింహా హిస్టరీని తిరగరాసింది. ఇండియన్ యానిమేషన్ మూవీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి ఇప్పటివరకు 315 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. నాలుగు వందల కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఎమోషనల్ లవ్‌స్టోరీ…
సైయారా మూవీతో చాలా రోజుల తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. ఈ మూవీతో అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లుగా హిందీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు మోహిత్ సూరి సైయారా మూవీని తెరకెక్కించారు. కేవలం నలభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు 600 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సెకండ్ మూవీగా నిలిచింది.
లేడీ ఓరియెంటెడ్ మూవీ…
మలయాళం టాప్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీ కొత్త లోక పేరు తగ్గట్లే సరికొత్త రికార్డులతో సంచలనం సృష్టిస్తోంది. మలయాళ సినీ చరిత్రలోనే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా వారం రోజుల్లోనే 185 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ దక్షిణాదిలో అత్యధిక వసూళ్లను రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీగా నిలిచింది. మోహన్‌లాల్ తుడరుమ్ మూవీ పెట్టిన పెట్టుబడికి ఐదింతల లాభాలను తెచ్చిపెట్టింది. 35 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 235 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
Also Read – KFC: కేఎఫ్‌సీ చికెన్ లొట్టలేసుకుంటూ తింటున్నారా?.. ఈ విషయం తెలిస్తే అస్సలు ముట్టుకోరు


