Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAdheera: ఈసారైనా సాక్షి వైద్య‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా?

Adheera: ఈసారైనా సాక్షి వైద్య‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా?

Adheera: సినీ ఇండ‌స్ట్రీలో ల‌క్ ఎంతో అవ‌స‌రం. కొంత మంది ముద్దుగుమ్మ‌ల‌కు అందం, అభిన‌యం ఉన్నా అదృష్టం లేకపోవ‌టంతో సినిమాల్లో రాణించ‌లేక‌పోయిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ఢిల్లీ బ్యూటీ సాక్షి వైద్య కూడా ఇదే కోవ‌కు చెందిన అమ్మాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టించిన‌ప్ప‌టికీ అవి డిజాస్ట‌ర్ కావ‌టం ఆమెకు అడ్డంకిగా మారింది. సాక్షి వైద్య టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సినిమా ఏజెంట్. ఈ సినిమాకు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అఖిల్ హీరోగా న‌టించారు. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో రూపొందిన ఈ చిత్రం డిజాస్ట‌ర్‌గా మారింది.

- Advertisement -

Also Read – The Girlfriend: ర‌ష్మిక మంద‌న్న మూవీకి జాక్‌పాట్ – రిలీజ్‌కు ముందే గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ఓటీటీ డీల్ క్లోజ్‌

తొలి సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాక‌పోయిన‌ప్ప‌టికీ ఈ సొగ‌స‌రికి మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమా ఏదో కాదు.. గాంఢీవ‌దారి అర్జున‌. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. దీంతో సాక్షి వైద్య‌కు ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర ప‌డిపోయింది. దీంతో ఆమెను మ‌న మేక‌ర్స్ దూరంగా పెట్టేశారు. అయితే కాస్త గ్యాప్ త‌ర్వాత ఈ బ్యూటీకి మ‌రో సినిమాలో న‌టించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇంత‌కీ సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టించ‌బోయే సినిమా ఏదనే వివ‌రాల్లోకి వెళితే..

హ‌ను మాన్ సినిమా త‌ర్వాత ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్ కొత్త సినిమా ఏది ఇంత వ‌ర‌కు స్టార్ట్ కాలేదు. అయితే ఆయ‌న రైట‌ర్‌గా మాత్రం రెండు సినిమాల‌కు వ‌ర్క్ చేస్తున్నారు. ఓ సినిమా మ‌హా కాళి కాగా.. మ‌రో మూవీ అధీర. ఇందులో అధీర విష‌యానికి వ‌స్తే ఇందులో ప్ర‌ముఖ నిర్మాత డివివి దాన‌య్య కొడుకు క‌ళ్యాణ్ హీరోగా న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా హీరోయిన్ పాత్ర కోసం సాక్షి వైద్య‌ను లుక్ టెస్ట్ చేశారు. దీనిపై త్వ‌ర‌లోనే మ‌రింత క్లారిటీ రానుంద‌ని స‌మాచారం. అధీర ఓ సూప‌ర్ హీరో మూవీ.

Also Read – Lava Agni 4: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్..లావా అగ్ని 4 లాంచ్ డేట్ ఫిక్స్..కీలక ఫీచర్లు వెల్లడి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad