Tuesday, September 17, 2024
Homeచిత్ర ప్రభSalman Bday: బర్త్ డేలో ఎంత మంది గర్ల్ ఫ్రెండ్సో, పాత గర్ల్ ఫ్రెండ్ ను...

Salman Bday: బర్త్ డేలో ఎంత మంది గర్ల్ ఫ్రెండ్సో, పాత గర్ల్ ఫ్రెండ్ ను కిస్ చేసిన స్టార్ హీరో

సల్మాన్ ఖాన్ బర్త్ డే అంటే మామూలుగా ఉండదు వ్యవహారం. ఆయనకున్న పాత కొత్త గర్ల్ ఫ్రెండ్స్ అంతా కలిసి రాత్రంతా పార్టీ చేసుకోవాల్సిందే. ఈ ఏడాది సల్మాన్ 57వ బర్త్ డే మరింత గ్రాండ్ గా సాగింది. పార్టీలో సల్మాన్ తన మాజీ ప్రేయసి, అజరుద్దీన్ ఎక్స్ సంగీతా బిజ్లానీని అందరిముందు ముద్దు పెట్టుకోవటం వైరల్ గా మారింది. సల్మాన్ మరో గర్ల్ ఫ్రెండ్ లులియా వంటూర్ కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇక సల్మాన్ లేటెస్ట్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన పూజా హెగ్డే ఈ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో “కిసీ కా భాయి కిసీ కీ జాన్” సినిమాలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్నారు. తమ మధ్య విభేదాలన్నీ పక్కనపెట్టి కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూడా వచ్చి సల్లూకి విషెస్ చెప్పి, హత్తుకోవటం సల్మాన్-షారూఖ్ ఫ్యాన్స్ కు హ్యాపీ మొమెంట్స్ ఇచ్చాయి. ఈ పార్టీకి పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్స్ వచ్చి సల్మాన్ తో కలిసి చిందులేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News