Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSalman Khan: సల్మాన్ ఖాన్‌పై టెర్రరిస్ట్ ముద్ర వేసిన పాక్

Salman Khan: సల్మాన్ ఖాన్‌పై టెర్రరిస్ట్ ముద్ర వేసిన పాక్

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను టెర్రరిస్ట్ గా పాకిస్తాన్ ప్రకటించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా సల్మాన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన పాకిస్తాన్ తాజాగా ఆయనను ఉగ్రవాదిగా ప్రకటించినట్లు సమాచారం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నిరోధక చట్టం, 1997లోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తులకు సంబంధించి తయారుచేసిన బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్‌ పేరును చేర్చారు. బలూచిస్తాన్ ప్రభుత్వ హోం శాఖ 16 అక్టోబర్ 2025న జారీ చేసిన నోటిఫికేషన్‌ దీన్ని ధ్రువీకరించింది.

- Advertisement -

ఇలా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వారి కదలికలపై పాకిస్తాన్ చట్టాల ప్రకారం నిఘా పెట్టడమే కాదు వారిపై ఆంక్షలు విధిస్తారు. అవసరం అనుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. ఇటీవల సౌదీలో జరిగిన ఓ కార్యక్రమంలో సల్మాన్ బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ నుండి వేరు చేసి మాట్లాడటమే ఇందుకు కారణమని అంటున్నారు. పాక్ మీడియా కూడా సల్మాన్ పైన తీవ్ర విమర్శలు చేసింది. బలూచిస్తాన్ ఏర్పాటువాదులు మాత్రం సల్మాన్ వ్యాఖ్యలను స్వాగతించారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/chiranjeevi-personality-rights-court-ban-on-using-name-photo/

అబుదాబిలోని రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరం 2025లో పాకిస్తాన్, బలూచిస్తాన్‌లను సల్మాన్ ఖాన్ విడివిడిగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి సల్మాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు ఖాన్‌లు కలిసి కనిపించి, మధ్యప్రాచ్యంలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ గురించి చర్చించారు.

మధ్యప్రాచ్యంలో నివసించే దక్షిణాసియా వర్గాలలో భారతీయ సినిమా ప్రభావం గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ, “ఇవాళ మీరు ఒక హిందీ సినిమా తీసి ఇక్కడ (సౌదీ అరేబియాలో) విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. మీరు ఒక తమిళ, తెలుగు లేదా మలయాళీ సినిమా చేస్తే, అది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే ఇతర దేశాల నుండి చాలా మంది ఇక్కడికి వచ్చారు. బలూచిస్తాన్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, పాకిస్తాన్ నుండి వచ్చినవాళ్లున్నారు. వాళ్లందరూ ఇక్కడ పనిచేస్తున్నారు.” అని వ్యాఖ్యానించారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/run-time-of-ravi-tejas-mass-jathara-is-here/

సల్మాన్ వ్యాఖ్యలకు సోషల్ మీడియా నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. చాలా మంది అతని వైఖరిని ప్రశంసించగా, పాకిస్తాన్‌కు చెందిన చాలా మంది దానిపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad