Salman Khan Too Much Show: తన వ్యక్తిగత జీవితంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. త్వరలో 60వ పడిలోకి అడుగుపెట్టనున్న సల్మాన్ ఖాన్ తనకీ పిల్లలను కనాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టాడు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం నటించిన ఈ ఓల్డ్ బ్యాచ్‌లర్.. ఇప్పుడు ఇలా మాట్లాడటం నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/neha-shetty-tem-song-removed-from-pawan-kalyan-og-movie/
ఐశ్వర్యా రాయ్, సంగీతా బిజ్లానీ, సోమీ ఆలీ, కత్రీనా కైఫ్ వంటి హీరోయిన్లతో కొంతకాలం ప్రేమాయణం నడిపించిన సల్మాన్ ఖాన్.. ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. సల్మాన్‌ను స్ఫూర్తిగా తీసుకుని మన తెలుగులోని కొందరు హీరోలు సైతం బ్యాచ్‌లర్స్‌గా ఉన్న వాళ్లే.. కాగా, ఇటీవల ‘టూ మచ్’ పేరుతో ట్వింకిల్ ఖన్నా, కాజోల్ కలిసి ఓ షోను హోస్ట్ చేస్తున్నారు. నేడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ షో మొదటి ఎపిసోడ్‌కి సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ గెస్ట్‌లుగా వస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/sukumar-official-clarity-on-pushpa-3/
ఇందుకు సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా సాగింది. అంతమందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా, సల్మాన్ ఖాన్‌కి ఒక్కటి కూడా ఎందుకు వర్కవుట్ కాలేదని అమీర్ ఖాన్ ప్రశ్నించగా.. దానికి ‘వర్కవుట్ కాలేదంతే.. ఆ విషయంలో నాదే తప్పు. ఎందుకంటే రిలేషన్‌షిప్ విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. పెళ్లి కాలేదు.’ అని సల్మాన్ ఖాన్ సమాధానమిచ్చాడు. కానీ తనకీ పిల్లలు కావాలని.. ఓ రోజు, త్వరలోనే పిల్లల్ని కంటానని ఈ కండలవీరుడు చెప్పాడు. త్వరలోనే తండ్రిని అవుతానని.. పిల్లలు పుడతారు.. చూద్దామంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు సల్మాన్ ఖాన్.. అయితే దత్తత తీసుకునే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశాడు.


