Salman Khan ‘Battle Of Galwan’: 2020 లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తాని సల్మాన్ ఖాన్ కలిశారు. బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ సినిమా షూటింగ్‌లో భాగంగా లడఖ్ వెళ్లిన సల్మాన్.. అక్కడ కవిందర్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. మూవీ షూటింగ్ కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
Bollywood icon Salman Khan paid a courtesy visit to the Hon’ble Lt. Governor Shri @KavinderGupta at the Raj Niwas, #Leh. pic.twitter.com/YByFcy8diS
— Office of the Lt. Governor, Ladakh (@lg_ladakh) September 13, 2025
2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన సంఘర్షణల ఆధారంగా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో గవర్నర్‌తో భేటీలో ఇరువురూ లడఖ్‌లో సినిమా షూటింగ్‌ల ప్రాముఖ్యత, పర్యాటక ప్రదేశాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: https://teluguprabha.net/cinema-news/mohan-babu-villain-role-confirms-in-nani-the-paradise-movie/
తెలుగు వీర సైనికుడి పాత్రలో సల్మాన్
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ చిత్రంలో సల్మాన్ ఖాన్.. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొంది, మహావీర చక్ర పురస్కారం అందుకున్న తెలుగు వీరుడు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతున్న షూటింగ్ నుంచి సల్మాన్ ఖాన్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటో వైరల్ కావడంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
కీలక సన్నివేశాల చిత్రీకరణ
ప్రస్తుతం లడఖ్, లేహ్ ప్రాంతాల్లో సినిమాకు అత్యంత కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. లడఖ్‌లో వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియదు. ఈ కారణంగా అత్యంత ముఖ్యమైన యాక్షన్, భావోద్వేగ సన్నివేశాలను మొదటి షెడ్యూల్‌లోనే పూర్తి చేసే యోచనలో ఉన్నారు. రాబోయే రెండు, మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Also Read: https://teluguprabha.net/cinema-news/dubbing-started-for-pawan-kalyan-og-movie/
గడ్డ కట్టే చలిలో
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్.. సైనికుడి యూనిఫాంలో సల్మాన్ దేశభక్తి ఉప్పొంగుతున్న తీరులో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా, లడఖ్‌లో షూటింగ్ చేయడం చాలా కఠినంగా ఉందని సల్మాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. ఎత్తైన ప్రదేశం, గడ్డకట్టే చల్లటి నీళ్లలో యాక్షన్ సీన్లు చేయడం పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు. ఈ పాత్ర కోసం పరిగెత్తడం, పోరాట సన్నివేశాల్లో పాల్గొనడం వంటివి ఉండటంతో ఎక్కువ సమయం శిక్షణ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘సికందర్’ తర్వాత ఈ సినిమా సల్మాన్‌కు బలమైన కమ్‌బ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


