Salmankhan vs Ar Murugadoss: అసలు ఈ కార్చిచ్చు ఎలా అంటుకుంది?
A.R. మురుగదాస్ వెర్షన్:
మురుగదాస్ గారు ఇటీవల తమ సినిమా మదరాసి ప్రమోషన్లలో మాట్లాడుతూ, అసలు సిసలు బాంబు పేల్చారు.
సల్మాన్ భాయ్ గారికి అప్పట్లో సీరియస్ బెదిరింపులు ఉన్నాయట! అందుకే, ఆయనకు సెక్యూరిటీ టైట్ చేసి, రాత్రి 9 గంటల తర్వాతే షూటింగ్‌కి అనుమతి ఇచ్చారట. (దీంతో పాపం డైరెక్టర్ గారు పగటి షాట్‌లను కూడా రాత్రిపూట VFX లైట్ల మధ్య తీయాల్సి వచ్చిందట!) అంత రాత్రి అయినా కూడా, సల్మాన్ గారు తరచుగా ఆలస్యంగా వచ్చేవారట! అందుకే టీమ్ తెల్లవార్లూ కష్టపడాల్సి వచ్చిందని, చివరకు సినిమా మొత్తం VFX పంజాలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.
‘సికందర్’ స్క్రిప్ట్ విషయంలో కూడా అడుగడుగునా ఎవరో జోక్యం చేసుకున్నారని చెప్పి, సినిమా ఫ్లాప్‌కి తన స్టైల్‌లో భాయ్‌నే blame చేశారు!
ALSO READ: https://teluguprabha.net/cinema-news/bhargav-ram-jr-ntr-son-trending/
సల్మాన్ ఖాన్ కౌంటర్:
ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న మన భాయ్ బిగ్ బాస్ 19 వీకెండ్ కా వార్ ఎపిసోడ్‌లో ఫుల్ ఫామ్‌లో రియాక్ట్ అయ్యారు! తనదైన హ్యూమర్ మరియు సర్కాజంతో మురుగదాస్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు.
“నేను ఆలస్యం… ఎందుకంటే?”
ఒక కమెడియన్ అడిగిన ప్రశ్నకు, సల్మాన్ తన ఫ్లాప్ లిస్ట్‌లో సికందర్ పేరు చెప్పి, ఆడియన్స్ రిజెక్ట్ చేసింది నిజమేనని ఒప్పుకున్నారు.
ఆ తర్వాత అసలు మ్యాటర్ ఎత్తారు. “నేను సెట్‌కి రాత్రి 9 గంటలకు వచ్చేవాణ్ణి, అందుకే సినిమా పాడైపోయిందని మా డైరెక్టర్ గారు (మురుగదాస్) చెప్పారు కదా! నిజానికి, నా పక్కటెముకలు విరిగిపోయాయి కాబట్టే లేట్‌గా వచ్చాను. అది నిర్లక్ష్యం కాదు, ఆరోగ్య సమస్య!” అంటూ డైరెక్టర్‌కి ఆరోగ్య పాఠాలు చెప్పారు.
“అవును… మా మురుగదాస్ గారు ఒక సినిమా తీశారు, దాని పేరు మదరాసి. అది సికందర్ కన్నా పెద్ద బ్లాక్‌బస్టర్!” అని నవ్వుతూ చెప్పారు.
“నేను లేట్‌గా వచ్చానని చెప్పిన ఆయన, ఇప్పుడు మదరాసి తీశారు. అందులో హీరో ఉదయం 6 గంటలకే సెట్‌కి వచ్చాడట… మరి ఆ సినిమా బ్లాక్‌బస్టర్ ఎలా అయిందో చెప్పండి?” అంటూ మురుగదాస్ స్టేట్‌మెంట్‌ని తిప్పి కొట్టారు!
ALSO READ: https://teluguprabha.net/cinema-news/jr-ntr-devara-tv-premiere-date-fixed/
ఒక్క మాటలో చెప్పాలంటే… సల్మాన్ దృష్టిలో: “సికందర్” ఫ్లాప్‌కి కారణం లేట్ ఎంట్రీ కాదు… మురుగదాస్ స్క్రిప్ట్, డైరెక్షనే!
మురుగదాస్ దృష్టిలో “సికందర్” ఫ్లాప్‌కి కారణం స్క్రిప్ట్‌లో జోక్యాలు, సల్మాన్ లేట్ ఎంట్రీ మరియు నైట్ షూట్‌లే!
ఈ వాదన చూస్తుంటే, సల్మాన్ vs మురుగదాస్ కథ ఇప్పట్లో ముగిసేలా లేదు. ఈ ఫైట్ ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.


