Thursday, July 4, 2024
Homeచిత్ర ప్రభSam: విజయ్ దేవరకొండ టీం 'ఖుషీ'

Sam: విజయ్ దేవరకొండ టీం ‘ఖుషీ’

‘సిటడెల్’ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. దీంతో సమంత ఇక విజయ్ దేవరకొండ సినిమా ఖుషీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో ఖుషీ టీం ఫుల్ హ్యాపీగా సామ్ కు వెల్కం చెప్పారు. రొమాంటిక్ డ్రామాగా రూపొందుకుంటున్న ఈ సినిమాతో చావో రేవో తేల్చుకునేందుకు విజయ్ రెడీ అయ్యారు. మరోవైపు ఓ యాడ్ లో ఉత్సాహంగా కనిపిస్తున్న విజయ్.. సమంతతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ భలే పండించారని చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. ‘లైగర్’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావటంతో విజయ్ ఖుషీపై చాలా ఆశలే పెట్టుకున్నారు.

- Advertisement -

డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఈ సినిమా హిట్ కావటం చాలా అత్యవసరంగా మారింది. దీంతో సామ్, విజయ్, శివ ముగ్గురూ కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ ఆసిస్తుండటంతో సినిమాపై రోజురోజుకీ హైప్ క్రియేట్ అవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News