ప్రముఖ సమంత నిరంతరం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తోంది. సినిమాల విషయం కంటే ఎఫైర్స్, పలు రకాల రూమర్స్ వల్లే సమంత పేరు గట్టిగా వినిపిస్తోంది. సమంత వివాహం, విడాకులు, లవ్ రూమర్స్ నుంచి బయటపడిన తర్వాత ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి.
తాజాగా సమంతా ఫోటో చర్చనీయాంశంగా మారింది. సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో పాటు, సిటాడెల్ అనే సిరీస్ లో కూడా కలిసి నటించారు. ఇవి పాన్ ఇండియా లో బాగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమారుతో సమంత క్లోజ్ గా ఉందనే రూమర్స్ కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మరోవైపు సమంత రాజ్ తో డేటింగ్ లో ఉందని బలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ టాప్ హీరోయిన్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు దీనిని మరింత బలపరుస్తున్నారు. పిక్ బాల్ లీగ్ మ్యాచ్ చూసేందుకు రాజ్, సమంత కలసి వెళ్లారు. పికిల్ బాల్ అంటే సామ్ కు ఇష్టం, పైగా పికిల్ బాల్ టోర్నీకి రాజ్ తో కలిసి అటెండ్ అయి ఫుల్ ఎంజాయ్ చేసింది సమంత. అయితే ఆమె రాజ్ తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫొటోస్ ద్వారా అర్థం అవుతోంది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు కాబట్టే అంత క్లోజ్ గా ఉంటున్నారు అని నెటిజన్లు అంటున్నారు. దీనితో సమంతపై ట్రోలింగ్ మొదలైంది. రాజ్ కు ఇప్పటికే వివాహం అయ్యింది. అయితే అతనితో క్లోజ్ గా ఉన్న ఫోటోలు షేర్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. రాజ్ కుటుంబంలో సమంత చిచ్చు పెడుతోందని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజ్ అతని భార్య కొంత కాలంగా దూరంగా ఉంటున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు త్వరలో వీరిద్దరూ విడిపోతారని కూడా అంటున్నారు. దీంతో సమంత కారణంగానే వారు విడిపోతున్నారని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ్, సమంత మంచి స్నేహితులని అభిమానులు అంటున్నారు. రాజ్ తో డేటింగ్ నిజమో కాదో సమంత క్లారిటీ ఇస్తేనే తెలుస్తుంది.