Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSamantha: మరోసారి దొరికేసిన సామ్‌-రాజ్‌ నిడిమోరు..ఒకే కారులో జంటగా..!

Samantha: మరోసారి దొరికేసిన సామ్‌-రాజ్‌ నిడిమోరు..ఒకే కారులో జంటగా..!

Samantha-Raj: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు మధ్య కొనసాగుతున్న అనుబంధంపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వాళ్లిద్దరూ మళ్లీ కలిసి కనిపించడం వల్ల ఈ రిలేషన్ రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి.

- Advertisement -

స్నేహం కన్నా..మించింది..

ఇటీవలి కాలంలో సమంత, రాజ్ నిడిమోరు తరచూ కలసి కనిపించడం గమనార్హం. ముందుగా వీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అనంతరం శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు నిర్వహించడం చూసిన నెటిజన్లు, వీరి మధ్య స్నేహం కన్నా అంతకు మించింది ఏదో ఎక్కువే ఉందేమో అనే ఊహాగానాలు మొదలుపెట్టారు. ఆ తరువాత సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ విజయోత్సవ వేడుకకు ఇద్దరూ కలిసి రావడం, కలసి ఫోటోలు దిగడం గాసిప్స్‌కు మరింత బలం చేకూర్చింది.

ఈ కార్యక్రమాల్లో భాగంగా బయటకు వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో రాజ్ నిడిమోరు, సమంత భుజంపై చేయి వేసి నవ్వుతూ మాట్లాడడం కనిపించింది. మరొక ఫొటోలో ఇద్దరూ పక్కపక్కన కూర్చుని సంతోషంగా చర్చలు జరుపుతున్నట్టుగా కనిపించారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు, మీడియా వర్గాలు మరోసారి వారి మధ్య రిలేషన్ ఉందని చెప్పుకుంటున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-hari-hara-veera-mallu-likely-to-stream-on-amazon-prime-video-from-august-22/

ఒకే కారులో ప్రయాణిస్తున్న…

తాజాగా వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది. ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత, చాలామంది నెటిజన్లు “ఇది ఖచ్చితంగా బంధానికి దారితీస్తోంది”, “ఇదేంటి.. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారంటే రిలేషన్ ఫిక్స్ అనుకోవచ్చా?” అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే మరీ ముందుకెళ్లి సమంత రెండో పెళ్లి రాజ్‌తోనే జరుగుతుందని అంచనాలు చేస్తున్నారు.

ఈ ఊహాగానాలకు కారణం మాత్రం వీరిద్దరూ బయట ఎక్కడికి వెళ్లినా తరచూ కలిసే కనిపించడమే. ఇంతకముందు కూడా బాలీవుడ్‌లో రిలేషన్‌షిప్‌లపై ఎప్పటికప్పుడు ఈ తరహా వార్తలు రావడం సహజమే. కానీ టాలీవుడ్‌లో ఇది కొంత కొత్తగా అనిపిస్తోంది. సమంత కూడా ఈ మధ్యకాలంలో తాను ఎవరి గురించి బయట మాట్లాడకుండా తన జీవితం, కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉంటున్నారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/shruti-haasan-waiting-for-a-comeback-in-telugu-and-tamil/

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పూర్తిగా తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, కెరీర్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి వల్ల కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె, ఆ తరువాత మళ్లీ పని చేస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి తొలి ప్రయత్నంలోనే సక్సెస్‌ను అందుకున్నారు.

ఇద్దరూ ఒకే వేదికపై…

తాజాగా ‘శుభం’ అనే చిన్న బడ్జెట్ ఫిల్మ్‌కు సమంత నిర్మాతగా వ్యవహరించగా, అది బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా కూడా రాజ్ నిడిమోరు సమంతకు కలసి కనిపించడం, ఇద్దరూ ఒకే వేదికపై తమ సంతోషాన్ని పంచుకోవడం నెటిజన్ల దృష్టిని మరింత ఆకర్షించింది. వీరి స్నేహం గురించి బయట స్పష్టంగా ఏమీ చెప్పకపోయినా, వారిద్దరి ప్రెజెన్స్‌ వల్ల ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

ఇదిలా ఉండగా, సమంత ప్రస్తుతం ఓ వెబ్‌సిరీస్‌తో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉన్నారు. ఆమె మరోసారి బాలీవుడ్ ఎంట్రీపై కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అటు రాజ్ నిడిమోరు కూడా తన డైరెక్టింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. అయితే, వీరిద్దరూ తమ మధ్య ఉన్న బాండ్‌ను బయటకు చెప్పకుండా ఉండటంతో గాసిప్స్‌కు చెక్ పడటం లేదు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad