Samantha: ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరు కలిసి పారిస్ ట్రిప్పులకు, రెస్టారెంట్‌లకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా దీపావళి రోజు సమంత, రాజ్ నిడిమోరు డేటింగ్ వార్తలు మరోమారు తెరపైకి వచ్చాయి.
రాజ్ నిడిమోరు కుటుంబంతో దీపావళిని సమంత సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. రాజ్ ఫ్యామిలీతో కలిసి ఫొటోలు దిగింది. ఈ ఫొటోల్లో రాజ్, సమంత ఎక్కువగా హైలైట్ అయ్యారు. బాణాసంచా కాలుస్తూ ఆనందంగా దీపావళిని జరుపుకుంది సమంత. నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. సమంత షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నట్లుగా మరోమారు సమంత హింట్ ఇచ్చేసిందని నెటిజన్లు చెబుతోన్నారు. పెళ్లి కబురు వినిపించడం ఒక్కటే మిగిలిందని సమంత ఫొటోలను ఉద్దేశించి ఓ అభిమాని కామెంట్ చేశాడు.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్‌తో పాటు హనీ బన్నీ సిటాడెల్ వెబ్‌సిరీస్‌లు చేసింది సమంత. ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ టైమ్‌లోనే రాజ్‌తో సమంతకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. సమంత శుభం సినిమా ప్రొడక్షన్ పనులు మొత్తం రాజ్ స్వయంగా చూసుకున్నారు. కాగా రాజ్‌కు ఇది వరకే పెళ్లయ్యింది. 2015లో శ్యామల దే అనే యువతిని పెళ్లి చేసుకున్న రాజ్ మనస్పర్థల కారణంగా 2022లో విడాకులు ఇచ్చాడు. మరోవైపు సమంత కూడా హీరో నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుంది. రాజ్, సమంత త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై సమంత, రాజ్ ఇప్పటివరకు అఫీషియల్‌గా వెల్లడించలేదు. ఔననో, కాదనో చెప్పలేదు.
ఇటీవలే శుభం సినిమాతో నిర్మాతగా బ్లాక్‌బస్టర్ అందుకుంది సమంత. ఈ మూవీలో గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం మా ఇంటి బంగారం పేరుతో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ చేస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మిస్తోంది. హిందీలో రాజ్, డీకే దర్శకత్వంలో రక్త్ బ్రహ్మాండ్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేస్తుంది. ఈ హారర్ సిరీస్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
Also Read- Karthika masam: కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రం.. తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే!


