Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభSamantha : మరోసారి ఆసుపత్రిలో సమంత.. ఫ్యామిలీ రియాక్షన్ ఇదే..

Samantha : మరోసారి ఆసుపత్రిలో సమంత.. ఫ్యామిలీ రియాక్షన్ ఇదే..

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే చాలా గ్యాప్ తర్వాత మెయిన్ లీడ్ లో యశోద అనే సినిమా చేసింది. ఈ సినిమాలో తన యాక్టింగ్ తో అందర్నీ మెప్పించింది సామ్. యశోద సినిమా మంచి విజయం సాధించి ఇప్పటికే దాదాపు 40 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. యశోద సినిమా ప్రమోషన్స్ టైంలో తనకి మాయోసైటిస్ అనే వ్యాధి ఉందని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాని సమంత తెలిపింది.

సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో పోరాడుతుందని తెలిసి అందరూ షాకయ్యారు. తను త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. తాజాగా సమంత మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు, సమంత ఆరోగ్యం బాగోలేదని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది నిజమనుకొని సమంత అభిమానులు కంగారుపడ్డారు.

అయితే ఈ వార్తలు సమంత ఫ్యామిలీ వరకు వెళ్లడంతో ఆమె కుటుంబ సభ్యులు దీనిపై స్పందిస్తూ.. సమంత ప్రస్తుతం ఆరోగ్యంగా ఇంట్లోనే ఉంది. ఇలాంటి వార్తలని, ఫేక్ న్యూస్ లని నమ్మకండి. సమంతకి ఏమి కాలేదు” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News