Anjaan Re Release: రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ తెలుగులో మొదలైంది. ఆ తర్వాత తమిళం, బాలీవుడ్‌తో పాటు అన్ని భాషల్లో పాపులర్ అయ్యింది. కల్ట్ క్లాసిక్ సినిమాలను 4కే, డాల్బీ అట్మాస్ వంటి సాంకేతిక హంగులతో మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతున్నాయి. స్ట్రెయిట్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. బాహుబలి ఎపిక్ మూవీ యాభై కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు కోట్లలో వసూళ్లను సొంతం చేసుకున్నాయి.
ఒకప్పుడు కల్ట్ క్లాసిక్‌లుగా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన సినిమాలే రీ రిలీజ్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. కానీ ఫస్ట్ టైమ్ ఓ డిజాస్టర్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది.
సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన తమిళ మూవీ అంజాన్ నవంబర్ 28న మళ్లీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమా రీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. రీ ఎడిట్ చేసి సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంజాన్ మూవీ తెలుగులోనూ సికందర్ పేరుతో డబ్ అయ్యింది. రెండు భాషల్లో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా సమంత హీరోయిన్‌గా నటించింది. సూర్య, సమంత కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ తమిళ మూవీ ఇది.
Also Read – Aerospace : రక్షణ రంగంలో సరికొత్త రెక్కలు: ‘త్సల్లా ఏరోస్పేస్’కు మిలియన్ డాలర్ల ఊపు!
రీ రిలీజ్ వెర్షన్‌లో కొత్తగా సూర్య, సమంత లవ్ ట్రాక్‌ను యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. సమంతపై ఓ గ్లామర్ సాంగ్‌ను మేకర్స్ షూట్ చేశారు. లెంగ్త్ ఎక్కువవ్వడంతో రిలీజ్ టైమ్‌లో ఈ పాటను తొలగించారు. రీ రిలీజ్ వెర్షన్‌లో ఆ సాంగ్‌ను జోడించనున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంజాన్ రీ రిలీజ్ ప్రమోషన్స్‌ను కూడా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.
కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగిన లింగుస్వామి జోరుకు అంజాన్‌తోనే బ్రేకులు పడ్డాయి. ఈ డిజాస్టర్‌తో అతడి డౌన్‌ఫాల్ మొదలైంది. నవంబర్‌లో తమిళంలో అంజాన్‌తో పాటు కమల్‌హాసన్, మణిరత్నం నాయకన్, సూర్య, దళపతి విజయ్ నటించిన ఫ్రెండ్స్‌తో పాటు మరికొన్ని బ్లాక్‌బస్టర్ మూవీస్ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతున్నాయి.


