Samantha: సమంత సినిమాలో ఫుల్ ఫ్లెజ్డ్ రోల్‌లో కనిపించి చాలా రోజులే అవుతోంది. మియో సైటిస్ బారిన పడిన తర్వాత ఆమె యాక్టింగ్ కు దూరంగా ఉంటూ వస్తోంది. కాస్త నయమైన తర్వాత ఖుషి, సిటాడెల్ ఇండియన్ వెర్షన్ అయిన హనీ బనీని పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఆమె సినిమాల్లో నటించక పోవటంపై ఆమె ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆమె నిర్మాతగా కూడా శుభం అనే సినిమాను రూపొందించింది. ఆ సినిమా సక్సెస్ కావటంతో సమంత వెంటనే సినిమా చేయకుండా కాస్త బ్రేక్ తీసుకుని తన బ్యానర్లోనే తనే నటిస్తూ ఓ సినిమాను చేస్తుంది. ఆ సినిమాయే ‘మా ఇంటి బంగారం’. సినిమాను మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ సెట్స్ పైకి రావటానికి మాత్రం సమయం పట్టేసింది.
దసరా సందర్భంగా సమంత తన కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ను తనే నిర్మాతగా స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన ముహూర్తం వీడియోను ఆమె ఇప్పుడు రిలీజ్ చేసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఓ బేబి’ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో ‘మా ఇంటి బంగారం’ కోసం చేతులు కలిపింది. దర్శకురాలిగా నందినీ రెడ్డి కూడా మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ తరుణంలో సమంత వంటి స్టార్ హీరోయిన్ అవకాశం ఇవ్వటం కూడా ఆమెకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
Also Read – Sukumar: కుమారి 21F సీక్వెల్ గా ‘కుమారి 22F’ రాబోతోంది!
‘మా ఇంటి బంగారం’ బంగారం ఫస్ట్ లుక్ అప్పుడెప్పుడో రిలీజైంది. అది చూస్తుంటే సినిమా యాక్షన్ మూవీలా అనిపించింది. ఈ ప్రామిస్‌ను నిలబెట్టుకుంటామని మేకర్స్ అంటున్నారు. సరికొత్త రోల్‌లో సామ్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నారనటంలో సందేహం లేదు. ఈ ముహూర్తానికి క్లాప్‌ను కొట్టింది రాజ్ నిడుమోరు. ఈయన, సమంత రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వీడియోలో ప్రధానంగా కనిపించటంతో ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చినట్లు అయ్యింది.
ఈ చిత్రానికి సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మాతలు. ఓ బేబి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా… సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. సీతా మీనన్. వసంత్ మరిన్‌గంటి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. పల్లవి సింగ్ కాస్ట్యూమర్, ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
Started our journey with the Muhurtham of #MaaIntiBangaram, surrounded by love & blessings. ✨
We can’t wait to share with you what we’re creating… need all your love and support as we begin this special film. ❤️#MIB #Samantha #TralalaMovingPictures @TralalaPictures… pic.twitter.com/PwICPNsP8R— Samantha (@Samanthaprabhu2) October 27, 2025
Also Read – Medha Shankar: స్టన్నింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న 12th ఫెయిల్ బ్యూటీ


