Samantha: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఇతర వ్యాపారాలపై దృష్టి పెడుతుంటారు తప్ప నిర్మాతగానో, దర్శకురాలిగానో మారడం చాలా అరుదుగా జరిగే విషయం. కానీ, సమంత మాత్రం ఈ అరుదైన జాబితాలోనే చేరారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. చెన్నై టు హైదరాబాద్ బాగా చక్కర్లు కొట్టారు. ఇటు తెలుగులో, అటు తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సమంత హీరోయిన్‌గా నటించారు.
కానీ, గత కొంతకాలంగా పలు కారణాల వల్ల సమంత హీరోయిన్‌గా నటించడం లేదు. హిందీలో చేసిన వెబ్ సిరీస్‌కి మంచి పేరే వచ్చినప్పటికీ వాటినీ కంటిన్యూ చేయలేకపోయింది. ఆ మధ్య సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమా వచ్చింది. యూత్ లవ్ స్టోరీగా వచ్చిన ఇందులో ఆమె కూడా ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇక, సమంత నిర్మాణంలో ఎప్పుడో మొదలవ్వాల్సిన మా ఇంటి బంగారం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. కొన్ని రోజులైతే.. ఈ సినిమా ఉంటుందా లేదా? అనే సందేహాలు కూడా చాలామందిలో కలిగాయి.
కానీ, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు సామ్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టింగ్‌గా ఉంటారు. అలాగే, తాజాగా ఇన్‌స్టాలో కాసేపు తన అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ సమయంలో ఓ అభిమాని సమంతను మీ కొత్త సినిమా అప్‌డేట్ ఎప్పుడు ఇస్తున్నారు అని అడిగాడు. దానికి సామ్ సాలీడ్ రిప్లయ్ ఇచ్చారు. తన కొత్త సినిమా.. అది కూడా టాలీవుడ్‌లో ఇదే నెలలో ప్రారంభం కాబోతున్నట్టుగా తెలిపారు. దాంతో, ఆమె నటిస్తూ..నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ఈ నెలలోనే మొదలు కాబోతున్నట్టు క్లారిటీ వచ్చింది.
ఇక, ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇంతకముందు నందినీ రెడ్డి-సమంత కాంబినేషన్‌లో ఓ బేబి వచ్చి డీసెంట్ హిట్ సాధించింది. మళ్ళీ, ఇంతకాలానికి మా ఇంటి బంగారం తో ఈ ఇద్దరు కలిసి వర్క్ చేయబోతున్నారు. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రూలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ మూవీని, యాక్షన్-థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే, సమంత లుక్‌ని కూడా వదిలారు. కాగా, ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
Also Read- Pawan Kalyan: కురుపాం గురుకుల విషాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా.. విద్యార్థినుల మృతిపై విచారం


