Samantha: స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంపై మరోసారి సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే కొన్ని పోస్టులు రాగా.. అందుకు తగ్గట్టు వారిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరి మధ్య ఊహాగానాల ప్రేమకు ఇప్పుడీ చిత్రాలు బలాన్ని ఇస్తున్నాయి. ఇటీవలే తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సమంత.. ప్రస్తుతం అక్కడే కొంత సమయాన్ని గడుపుతోంది.
అయితే ఆమె దర్శకుడు రాజ్ నిడిమోర్‌తోనే సన్నిహితంగా సమయాన్ని గడుపుతున్న ఫొటోలు వైరల్ అవ్వగా.. వారిద్దరి సంబంధం గురించి మరోసారి చర్చ మొదలైంది.
అసలు కథ ఇదేనా?
హీరోయిన్ సమంత ఇటీవలే తన అమెరికా ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫొటోల్లో తన స్నేహితులతో పాటు దర్శకుడు రాజ్ నిడిమోర్‌తో కూడా ఆమె మరింత సన్నిహితంగా ఉండడం ఆశ్చర్యాన్ని గురిచేసింది. దీంతో వారిద్దరి మధ్య నడుస్తున్న ఊహాగానాలు నిజం చేసేట్టు ఈ ఫొటోలు ఉన్నాయి. వీరిద్దరి ప్రేమాయణాన్ని నిజం చేస్తున్నట్లుగా ఫ్యాన్స్ ‘శుభాకాంక్షలు’ తెలియజేస్తున్నారు.
దర్శకుడితో రిలేషన్ ఎలా?
రాజ్-డీకే దర్శకద్వయంలో రూపొందిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 1 & 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి ప్రాజెక్టులలో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ల షూటింగ్ సమయంలో రాజ్ నిడిమోరుతో ఆమెకు మంచి సాన్నిహిత్యం ఏర్పడినట్లు సమచారం. అంతేకాకుండా సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా ఉన్నారు. ఈ పరిచయమే వారి మధ్య ప్రేమాయణానికి దారితీసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
View this post on Instagram


