Samantha: మయోసైటీస్ కారణంగా రెండేళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది సమంత. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సామ్ తిరిగి కెరీర్‌పై ఫోకస్ పెడుతోంది. ఇటీవలే శుభం సినిమాతో నిర్మాతగా పెద్ద హిట్ అందుకుంది. ఈ హారర్ కామెడీ మూవీలో గెస్ట్ రోల్ తళుక్కున మెరిసింది. తాజాగా హీరోయిన్‌గా కోలీవుడ్‌లో సమంత క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం.
అరసన్…
శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అరసన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తో పాటు శింబు ప్రీ లుక్ పోస్టర్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో కత్తితో వింటేజ్ లుక్‌లో శింబు కనిపిస్తున్నారు. అతడి పక్కన పాతకాలం నాటి సైకిల్ ఉంది. అరసన్ ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సింగిల్ సిట్టింగ్‌లోనే…
ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో శింబుకు జోడీగా సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సమంతను సంప్రదించిన మేకర్స్ ఆమెకు కథను వినిపించినట్లు చెబుతున్నారు. మల్టీపుల్ షేడ్స్‌తో సాగే క్యారెక్టర్ కావడంతో సింగిల్ సిట్టింగ్‌లోనే శింబు సినిమాకు సమంత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. శింబు, వెట్రిమారన్ సినిమాతో దాదాపు మూడేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది సమంత. చివరగా 2022లో వచ్చిన కాథువకుల రెండు కాదల్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విజయ్ సేతుపతి హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సమంతతో పాటు నయనతార ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ తర్వాత కోలీవుడ్‌కు దూరమైంది. వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు, మయోసైటీస్ కారణంగా పలు భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశాలను వదులుకుంది సమంత.
మా ఇంటి బంగారం…
ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం పేరుతో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ చేస్తోంది సమంత. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచే మొదలుకానుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత వెల్లడించింది. హీరోయిన్‌గా నటిస్తూనే ఈ మూవీని స్వయంగా ప్రొడ్యూస్ చేస్తోంది సమంత. మరోవైపు సమంత లీడ్ రోల్‌లో నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ షూటింగ్ పూర్తయ్యింది. ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో స్ట్రీమింగ్ కానుంది.


