Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభSamantha : సమంత గురించి స్టార్ ప్రొడ్యూసర్స్ వ్యాఖ్యలు.. రిప్లై ఇచ్చిన సామ్..

Samantha : సమంత గురించి స్టార్ ప్రొడ్యూసర్స్ వ్యాఖ్యలు.. రిప్లై ఇచ్చిన సామ్..

- Advertisement -

Samantha : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి పలువురు సెలబ్రిటీలని తీసుకొచ్చి బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నలు అడిగి హంగామా చేస్తూ ఉంటారు. ఈ షోకి మంచి రెస్పాండ్ వస్తుంది. ప్రస్తుతం సీజన్ 2 ఘనంగా సాగుతుంది. తాజాగా ఈ సీజన్ లో ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు.

ఈ ఎపిసోడ్ లో అనేక సినిమాల గురించి, సినిమా విషయాల గురించి, ఇప్పుడున్న హీరో, హీరోయిన్స్ గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఇప్పటి హీరోయిన్స్ లో మహానటి లాగా ఎవరు చేయగలరు అని బాలయ్య అడిగారు. దీనికి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్ ఇద్దరూ కూడా సమంత అని సమాధానమిచ్చారు.

దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. సమంత అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అయితే ట్విట్టర్లో ఓ సమంత ఫ్యాన్ పేజ్ ఈ వీడియో బైట్ ని షేర్ చేసి సమంతకి ట్యాగ్ చేయగా సమంత దీనిని షేర్ చేస్తూ లవ్ సింబల్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News