Samantha Engagement: తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అక్కర్లేని పేరు సమంత. అక్కినేని వారి ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమె తన పూర్తి సమయాన్ని సినిమాల మీదే పెట్టినట్లు తెలుస్తోంది.కొంతకాలం క్రితం వరకు సమంత తన ఆరోగ్యం మీద పూర్తి ఫోకస్ పెట్టింది.ఆ తరువాత నుంచి సొంతంగా సినిమాలు నిర్మించడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. అయితే గత కొంత కాలం నుంచి సమంత విషయంలో ఓ మేటర్ తెగ షికారు చేస్తోంది.
రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం..
ఆమె తన సహచరుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడుపుతుందని,త్వరలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్న వార్తలు కూడా షికారు చేస్తున్నాయి. అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫొటో అందర్ని షాక్ కి గురి చేసింది. ఆ ఫొటోలో ఆమె తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ ఉంగరం చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే ఇది ఎంగేజ్మెంట్ రింగ్ అని భావించి, ఆమె నిశ్చితార్థం జరిగిపోయిందా? అనే చర్చలు సోషల్ మీడియాలో చర్చలు పెట్టేశారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్..
ఈ ఫొటోకు సంబంధించి నానా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని వారాలుగా సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. ఇద్దరూ కలిసి కొన్ని ఫిలిం ఈవెంట్లకు వెళ్లడం, ఓ రెండు సందర్భాల్లో విదేశాలకు వెళ్లినప్పుడు తీసిన ఫోటోలు వైరల్ కావడం ఇవన్నీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో వీరి మధ్య వ్యక్తిగత బాంధవ్యంపై అనేక రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి.
రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌లో సమంత నటించింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్‌కి మంచి స్పందన లభించింది. ఆ సిరీస్ సమయంలోనే వీరి మధ్య పరిచయం మొదలైందని, ఆ తరువాత ‘సిటాడెల్: హానీ బన్నీ’ అనే మరో సిరీస్ చేస్తూ మరింత సన్నిహితంగా మారినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఇద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
నిశ్చితార్థపు ఉంగరం..
ఇప్పటివరకు సమంతను అనేక సందర్భాల్లో ఫొటోలకు పోజులిచ్చినప్పటికీ, ఈసారి ఆమె చేతిలో కనిపించిన రింగ్ ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఇదే కారణంగా ఇది సాధారణ ఫొటో కాదని భావించిన నెటిజన్లు, ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా అనే కోణంలో చర్చలు మొదలుపెట్టారు. దీనిపై సమంత స్పందించకపోవడంతో ఆ రూమర్లకు మరింత బలమొచ్చింది.
మరోవైపు సమంత సన్నిహిత వర్గాల ప్రకారం, రాజ్ నిడిమోరుతో ఆమె మంచి స్నేహితురాలిగా మాత్రమే ఉన్నట్టు చెబుతున్నారు. వారు కలిసి కనిపించడం వెనుక వ్యక్తిగత కారణాలేమీ లేవని, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వంటి ప్రొఫెషనల్ వర్క్ కారణంగానే సంబంధం ఏర్పడిందని అంటున్నారు. అయినప్పటికీ వారి కలిసి తీసుకున్న ఫోటోలు, సోషల్ మీడియాలో కనిపించే కెమిస్ట్రీ చూస్తే మాత్రం వీరి మధ్య రొమాన్స్ ఉందన్నట్లే ఫీలవుతుంది.


