Monday, June 9, 2025
Homeచిత్ర ప్రభSamantha: స్పెట్స్ మిర్రర్ మిస్టరీ.. అడ్డంగా దొరికిపోయిన సమంత..!

Samantha: స్పెట్స్ మిర్రర్ మిస్టరీ.. అడ్డంగా దొరికిపోయిన సమంత..!

టాలీవుడ్ గ్లామర్ క్వీన్ సమంత ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్ గా మారింది. అయితే తాజాగా ఆమె వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ఫోటోలోని ఓ చిన్న వివరమే పెద్ద చర్చకు దారి తీసింది. బ్లాక్ స్పెట్స్ ధరించి ఓ స్టైలిష్ సెల్ఫీని సమంత ఇటీవల షేర్ చేసింది.

- Advertisement -

సాధారణంగా ఫ్యాషన్‌కు ట్రెండ్ సెట్టర్ అయిన సమంతకు ఇది పెద్ద విషయమే కాదు. కానీ ఆ ఫోటోలో స్పష్టంగా కనిపించిన ఓ మగ వ్యక్తి ప్రతిబింబం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ ఫోటోను ఎవరో కాకుండా సమంతకు రూమర్ బాయ్ ఫ్రెండ్ అని పేరుపడిన రాజ్ నిడిమోర్.. అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర విషయం బయటకొస్తోంది.

సమంత, రాజ్ కలిసి దుబాయ్ వెకేషన్ లో ఉన్నట్లు చేసినట్లు కొన్ని సోషల్ మీడియా వర్గాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఈ విషయంపై అధికారికంగా స్పందించకపోయినా.. సమంత ఇటీవల చేసిన శ్రీకాళహస్తి పర్యటన కూడా ఇదే నేపథ్యంలోనని కొందరు విశ్లేషిస్తున్నారు. అక్కడ ఆమె చేసిన ప్రత్యేక పూజలు పెళ్లికి సంబందించినవేనని అప్పుడే ఊహాగానాలు వచ్చాయి.

ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారని భావిస్తున్న ఈ రూమర్డ్ కపుల్ పై మరిన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి. నిజమెంతో స్పష్టంగా తెలియకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు దుమ్మురేపుతున్నాయి. సమంత అభిమానులు మాత్రం ఇది నిజమా.. కేవలం హైప్ కోసమా.. అని ప్రశ్నలు వేస్తున్నారు. సమంత స్పందిస్తేనే ఈ మిస్టరీకి క్లారిటీ వస్తుంది. అప్పటివరకు మాత్రం ఈ “స్పెట్స్ మిర్రర్ మిస్టరీ” హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News