Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా సమయంలో సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు, ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. దీంతో సమంత త్వరగా కోలుకోవాలని అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు కోరుతూ కామెంట్స్ చేశారు.
సమంత ఈ వ్యాధికి మొదట అమెరికాలో వైద్యం చేయించుకుందని సమాచారం. ఆ తర్వాత అదే వైద్యాన్ని ఇండియాలో కంటిన్యు చేసిందట. ఇటీవల సమంత కుటుంబ సభ్యులు ఆమె బాగానే ఉందని, ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటుందని తెలిపారు. అయితే సమంత కేరళ వెళ్లి మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం తీసుకుంటున్నట్టు సమాచారం.
అక్కడి మీడియా ప్రకారం సమంత ఆయుర్వేద వైద్యం చేయించుకోవడానైకి కేరళ వెళ్లినట్టు, ప్రస్తుతం సమంత ఆ వైద్యం కూడా చేయించుకుంటున్నట్టు తెలుస్తుంది. సమంత ఏ వైద్యం చేయించుకున్నా త్వరగా కోలుకొని తిరిగి రావాలని, వరుస సినిమాలు చేయాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.