Monday, September 16, 2024
Homeచిత్ర ప్రభSamantha : యశోద ఓటీటీలోకి వచ్చేస్తుంది..

Samantha : యశోద ఓటీటీలోకి వచ్చేస్తుంది..

- Advertisement -

Samantha : సమంత చాలా గ్యాప్ తర్వాత మెయిన్ లీడ్ లో చేసిన సినిమా యశోద. లేడీ ఓరియెంటెడ్ గా సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో సరోగసి కాన్సప్ట్ పై తెరకెక్కింది యశోద సినిమా. నవంబర్ 11న ఈ సినిమా రిలీజయి మంచి విజయం సాధించింది. దాదాపు థియేటర్స్ లో 40 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది యశోద సినిమా.

చాలా గ్యాప్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ గా వచ్చి హిట్ కొట్టడంతో సమంత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒప్పందం ప్రకారం యశోద సినిమా నెల రోజుల తర్వాత ఓటీటీకి రానుంది. యశోద సినిమా రైట్స్ ని ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ సంస్థ తీసుకుంది.

దీంతో డిసెంబర్ 9 నుంచి సమంత యశోద సినిమా అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వనుంది. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాని స్ట్రీమ్ చేయబోతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. థియేటర్స్ లో ఈ సినిమా మిస్ అయినవాళ్లు ఓటీటీలో చూసేయచ్చు. ఇక అభిమానులు మరోసారి ఓటీటీలో చూసేయడానికి రెడీ అయిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News