SYG Asura Aagamana: బర్త్‌డే రోజు ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు మెగా హీరో సాయిధరమ్‌తేజ్. ఆయన హీరోగా నటిస్తున్న సంబరాల యేటి గట్టు (ఎస్‌వైజీ) మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. యాక్షన్ అంశాలతో రా అండ్ రస్టిక్‌గా ఈ గ్లింప్స్ సాగింది. పీరియాడికల్ లుక్‌తో విజువల్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. బీజీఎమ్ ఆకట్టుకుంటుంది. చుట్టూ కంచెలతో నిండిపోయిన మైనింగ్ ఏరియా, అక్కడ బానిసల్లా బతుకుతున్న ప్రజలు, తన అనుచరణ గణంతో వారిపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఓ నాయకుడు. వారిని ఎదురించే ఓ ధీరుడి కథతో సంబరాల ఏటిగట్టు మూవీ సాగనున్నట్లు గ్లింప్స్ ద్వారా ఆవిష్కరించారు. ఒక మనిషి.. ఒక భూమి.. వాటిని బలంగా బంధించే రక్త బంధం అంటూ గ్లింప్స్ పోస్టర్‌లో క్యాప్షన్ ఇచ్చారు.
సాయిదుర్గ తేజ్…
సాయిదుర్గ తేజ్ ఎంట్రీ ఇచ్చే సీన్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం అంటూ కత్తి పట్టుకొని సాయిదుర్గ తేజ్ చెప్పిన ఇంటెన్స్ డైలాగ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తోంది. సంబరాల యేటి గట్టులో సాయి తేజ్ లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా ట్రాన్స్‌ఫర్మ్ అయినట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్‌లో సాయి ధరమ్‌తేజ్ కనిపించబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు. అసుర ఆగమన అంటూ రిలీజ్ చేసిన సంబరాల యేటి గట్టు గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొత్త దర్శకుడు…
సంబరాల యేటి గట్టు మూవీ ద్వారా రోహిత్ కేపీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. దాదాపు రూ. 125 కోట్ల బడ్జెట్‌తో హనుమాన్ ప్రొడ్యూసర్లు నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయిదుర్గ తేజ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా ఎస్‌వైజీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబరాల యేటి గట్టు మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్, అనన్య నాగళ్ల, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read- Smriti Irani: దీపికా పదుకొణె 8 గంటల పని.. వివాదంపై స్మృతి ఇరానీ కౌంటర్
ఈ సినిమాను సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులు డిలే కావడంలో విడుదల తేదీని వాయిదా వేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. నవంబర్‌లో ఎస్‌వైజీ రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు కాంతార చాఫ్టర్ వన్ ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
యువ కథానాయకుడు, సామాజిక స్పృహ కలిగిన బాధ్యతాయుతమైన పౌరుడు సాయి దుర్గా తేజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కథానాయకుడిగా మరిన్ని విజయాలు అందుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
– @PawanKalyan@IamSaiDharamTej #HBDSaiDurghaTej pic.twitter.com/QCYodgfteH
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) October 15, 2025


