Samyuktha: టాలీవుడ్‌లో మలయాళ ముద్దుగుమ్మల డామినేషన్ కొనసాగుతోంది. నయనతార, అనుపమ పరమేశ్వరన్, మమితాబైజుతో పాటు పలువురు నాయికలు వరుస అవకాశాలను అందుకుంటూ సత్తాచాటుతోన్నారు. సంయుక్త మీనన్ ఏకంగా తొమ్మిది సినిమాలు చేస్తూ దక్షిణాదిలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. స్టార్, యంగ్.. హీరోలు ఎవరైనా నాయికగా సంయుక్త మీనన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 2026లో.. రెండు నెలలకు ఓ మూవీ చొప్పున సంయుక్త నటించిన సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
బాలకృష్ణ అఖండ 2లో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. తొలుత ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా అనుకున్నారు. ఓపెనింగ్ ఈవెంట్‌లో ప్రగ్యా పాల్గొన్నది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో ప్రగ్యా జైస్వాల్ న్యాయం చేయలేదని భావించిన మేకర్స్ ఆమెను తప్పించి సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది.
Also Read- Dude Movie: దివాళీ బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?… ఎందులో చూడాలంటే?
అఖండ 2 తర్వాత నెల రోజుల గ్యాప్‌లోనే సంయుక్త మరో మూవీ నారి నారి నడుమ మురారి థియేటర్లలో సందడి చేయబోతుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీలో సంయుక్త మీనన్‌తో పాటు సాక్షి వైద్య మరో నాయికగా కనిపించబోతున్నది.
విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీలో సంయుక్త హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యింది. పూరి సేతుపతి మూవీలో ఛాలెంజింగ్ రోల్‌లో సంయుక్త నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘స్వయంభూ’ మూవీ కోసం నిఖిల్‌తో జోడికట్టింది సంయుక్త మీనన్. నిఖిల్ ఫస్ట్ టైమ్ హిస్టారికల్ కాన్సెప్ట్‌తో చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో నభా నటేష్ కూడా ఉంది.
హైందవ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రొమాన్స్ చేయబోతుంది సంయుక్త మీనన్. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇవే కాకుండా ది బ్లాక్ గోల్డ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సంయుక్త. చింతకాయల రవి ఫేమ్ యోగేష్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి సంయుక్త మీనన్ ప్రజెంటర్‌గా కూడా వ్యవహరిస్తుంది. ఇటీవల దీపావళి సందర్భంగా మూవీ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
Also Read- Ram Pothineni : రామ్ చరణ్‌ను అప్పుడు చూసి జాలేసింది.. హీరో రామ్ కామెంట్స్ వైరల్
తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ ఉంది. లారెన్స్ హీరోగా లోకేష్ కనగరాజ్ కథను అందిస్తున్న బెంజ్‌లో కథానాయికగా సంయుక్తనే ఛాన్స్ కొట్టేసింది. మోహన్‌లాల్ రామ్‌తో మలయాళ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. వీటితో పాటు మహారాణి మూవీలో త్వరలోనే బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది సంయుక్త మీనన్. ఈ అమ్మడి జోరు చూస్తుంటే వచ్చే రెండు, మూడేళ్ల వరకు ఆమె డేట్స్ ఖాళీ లేనట్లుగానే కనిపిస్తోంది.


