Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSpirit: సందీప్ రెడ్డి వంగా మ్యాజిక్, 'స్పిరిట్'లో అదృష్టం ఎవరిని వరించనుంది?

Spirit: సందీప్ రెడ్డి వంగా మ్యాజిక్, ‘స్పిరిట్’లో అదృష్టం ఎవరిని వరించనుంది?

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా అంటేనే ఒక ట్రెండ్ సెట్టర్. మనోడు సినిమా చేసాడంటే, అందులో నటించిన వారికి, పనిచేసిన టెక్నీషియన్స్‌కి కెరీర్ టర్నింగ్ పాయింట్ ఖాయం. ‘అర్జున్ రెడ్డి’తో విజయ్ దేవరకొండ, రాహుల్ రామకృష్ణ; ‘యానిమల్’తో రణబీర్ కపూర్, తృప్తి డిమ్రి, బాబీ డియోల్… ఇలా చాలామందికి వంగా లక్ బాగా కలిసొచ్చింది.

- Advertisement -

ప్రస్తుతానికి వంగా దృష్టి మొత్తం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మీద ఉంది. తన కెరీర్‌లోనే తొలిసారి పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘సౌండ్ స్టోరీ’ గ్లింప్స్‌తో.. జైలులో ఉన్న ఒక కరుడుగట్టిన ఆఫీసర్‌గా, “నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది” అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ అంచనాలను పీక్స్‌కి తీసుకెళ్లింది. ఈ పాత్ర ప్రభాస్‌కు ‘బాహుబలి’ తర్వాత మరో బిగ్గెస్ట్ హిట్ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. అయితే, వంగా సినిమాల్లో కేవలం హీరోలకే కాదు, ఇతర కీలక పాత్రలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. ఈసారి ఆ అదృష్టాన్ని వరించబోతున్నది ఆ ఇద్దరు పాత తరం స్టార్స్ కే అనే చర్చ నడుస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epic-trailer-ss-rajamouli-4k-re-release/

1. వివేక్ ఒబెరాయ్: ‘యానిమల్’ లో బాబీ డియోల్‌కి మాస్ కమ్-బ్యాక్ ఇచ్చినట్టే, ‘స్పిరిట్’లో విలన్ రోల్‌లో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్‌కు కూడా వంగా బ్రాండ్ ఇమేజ్ పెద్ద బూస్ట్ ఇవ్వనుంది. కొంతకాలంగా సరైన హిట్ లేని వివేక్ ఒబెరాయ్‌కు ఇది గట్టి రీఎంట్రీ అవుతుందని అంటున్నారు.

2. తృప్తి డిమ్రి: ‘యానిమల్’లో చిన్న పాత్రతోనే యూత్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇప్పుడు ‘స్పిరిట్’లో ప్రభాస్ సరసన మెయిన్ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుంది. వంగా దర్శకత్వంలో రెండోసారి నటిస్తోంది కాబట్టి, ఈ సినిమాతో తృప్తి పాన్-ఇండియా రేంజ్‌కి ఎదగడం పక్కా అని చెప్పొచ్చు.

3. హర్షవర్ధన్ రామేశ్వర్: ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో వెన్నుముకగా నిలిచాడు. ఇప్పుడు ‘స్పిరిట్’ కోసం ఏకంగా షూటింగ్‌కు ముందే 70% సౌండ్ ట్రాక్‌ను సిద్ధం చేయడం వంగా మార్క్ ప్రయోగం. ఈ మ్యూజిక్ డైరెక్టర్‌కు ‘స్పిరిట్’ మరింత పెద్ద గుర్తింపును తెచ్చిపెట్టనుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/khaidi-2-dilli-vs-rolex-lokesh-kanagaraj-lcu/

సందీప్ రెడ్డి వంగా సినిమా అంటేనే, తెరపై ప్రతి పాత్రకు బలమైన ఇంటెన్సిటీ ఉంటుంది. అందుకే, ప్రభాస్ ఐపీఎస్ పాత్రతో పాటు, ఈ కీ రోల్స్ పోషిస్తున్న వారికి కూడా ఇది లైఫ్‌టైమ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. 2026 లో ‘స్పిరిట్’ విడుదలయ్యాక, వంగా టచ్‌తో స్టార్‌గా నిలబడే అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad