Friday, July 5, 2024
Homeచిత్ర ప్రభSandeep Vanga: 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సినిమా అందుకే లేటా?

Sandeep Vanga: ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సినిమా అందుకే లేటా?

సందీప్ స్ట్రాటెజీ సూపర్ అంటున్న బాలీవుడ్

 తన తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’తో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న లక్కీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.  ఈయనతో సినిమా అంటే తమ ఇమేజే మారిపోతుందనే రేంజ్ లో ఆశపడేలా హీరోలకు సరికొత్త బ్రేక్ ను ఇచ్చే బెస్ట్ డైరెక్టర్ గా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ లో ఉన్నారు సందీప్. జస్ట్ రెండు మూడు సినిమాలతోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా సందీప్ ఎదిగారు.  బాలీవుడ్ లో గ్యాంగ్ స్టర్ సినిమాగా వస్తున్న రణబీర్ కపూర్ సినిమా ‘అనిమల్’ తో మరోసారి తన కెరీర్ లో హిట్ కొట్టే పనిలో బిజీగా ఉన్నారు సందీప్. 

- Advertisement -

వల్డ్ క్లాస్ క్వాలిటీతో వస్తున్న సందీప్

‘అనిమల్’ సినిమా నిజానికి ఆగస్టు 11న రిలీజ్ కావాల్సి ఉంది.  కానీ 4 నెలల పాటు రిలీజ్ వాయిదా పడిందట.  వీఎఫ్ఎక్స్ కారణంగానే ఇలా మరింత టైం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఓవైపు ఇండిపెండెన్స్ డే, మరోవైపు ‘గదర్ 2’, ‘ఓ మై గాడ్ 2’ వంటి పెద్ద బ్యానర్-హీరోల సినిమాల రిలీజ్ ఇదే టైంలో ఉండటం అసలు కారణంగా తెలుస్తోంది.  ఈ కారణంగా అనిమల్ రిలీజ్ ను డిసెంబర్ కు పుష్ చేశారని ఇండస్ట్రీలో గుసగుసలున్నాయి. ఇండస్ట్రీలో అస్సలు కాంప్రమైజ్ ప్రాడక్ట్ ఇవ్వటంలో సందీప్ కు అస్సలు పోటీలో ఎవరూ ఉండరు.  అందుకే మరింత టైం తీసుకుని వల్డ్ క్లాస్ క్వాలిటీతో రణబీర్ అనిమల్ రిలీజ్ చేయటంలో సందీప్ మునిగిపోయారు.  డిసెంబర్ 1కి డేట్ లాక్ చేశారు..ఎందుకంటే ఆతరువాత కనీసం ఓ 3 వారాలపాటు ఏ పెద్ద హీరో, బిగ్ బ్యానర్ మూవీస్ రిలీజ్ కావట్లేదు కాబట్టి బిజినెస్ పరంగా ఇది బాగా వర్కౌట్ అవుతుందని సేఫ్ గేమ్ ఆడుతున్నారు సందీప్.

అనిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్ కాగా హీరోయిన్ రష్మిక మందన, అనిల్ కపూర్-బాబీ డియోల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను టీ సిరీస్ అత్యంత ఆంబిషియస్ ఫిలింగ్ తెరకెక్కుతుండటం విశేషం.  అసలే టీ సిరీస్ తీసిన భారీ బడ్జెట్ సినిమా ఆదిపురుష్ డిజాస్టర్ కావటంతో టీ సిరీస్ పెద్దలు అతి జాగ్రత్తగా అనిమల్ విషయంలో అడుగు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News