Sangeeth Shobhan: మ్యాడ్ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ గ్యాంబ్లర్స్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఆగస్ట్ 14 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. జూన్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది.
గ్యాంబ్లర్స్ మూవీకి కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహించాడు. ప్రశాంతి చారులింగా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో జబర్ధస్త్ రాకింగ్ రాకేష్ ఓ కీలక పాత్ర పోషించారు.
కామెడీ మిస్సవ్వడంతో…
మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ తర్వాత సంగీత్ శోభన్ హీరోగా నటించిన మూవీ కావడంతో గ్యాంబ్లర్స్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కాన్సెప్ట్‌లో కొత్తదనం లేకపోవడం, సంగీత్ శోభన్ శైలి కామెడీ, పంచ్‌లు మిస్సవ్వడంతో గ్యాంబ్లర్స్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఏంజెల్ అనే మెజీషియన్ క్యారెక్టర్‌లో సంగీత్ శోభన్ నటించాడు. కామెడీ జానర్ నుంచి బయటకు వచ్చి సంగీత్ శోభన్ ఈ మూవీ చేశాడు. కమర్షియల్‌గా సినిమా ఆడకపోయినా సంగీత్ శోభన్ యాక్టింగ్‌కు మాత్రం మంచి పేరొచ్చింది. గ్యాంబ్లర్స్ మూవీకి శశాంక్ తిరుపతి మ్యూజిక్ అందించాడు.
Also Read- Dhanush Mrunal Thakur Dating: ధనుష్‌తో డేటింగ్ నిజానిజాలేంటి.. మృణాల్ ఠాకూర్ క్లారిటీ
వంద కోట్ల డైమండ్…
మిస్టీరియస్ ఐలాండ్‌లోని ఓ గ్యాంబ్లింగ్ క్లబ్‌లో వంద కోట్ల డైమండ్ ఉంటుంది. ఆ డైమండ్ కోసం ఏంజెల్, గాయత్రి క్లబ్‌కు వస్తారు. వారితో పాటు మరో ఐదుగురు కూడా డైమండ్ కోసం క్లబ్‌లోకి వచ్చారనే విషయం ఏంజెల్ కనిపెడతాడు. వారిలో ఆ డైమండ్ ఎవరికి దొరికింది? సరదాగా మొదలైన గేమ్ చివరకు ఒకరి ప్రాణాలు మరొకరు తీసే స్థాయికి ఎలా చేరుకుంది అన్నదే ఈ మూవీ కథ.
సోలో హీరోగా…
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు సంగీత్ శోభన్. ఫన్ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కిన ఈ సినిమాలతో హీరోగా విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం సోలో హీరోగా ఓ ఫాంటసీ కామెడీ మూవీ చేస్తున్నాడు సంగీత్ శోభన్. మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నది. ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా కనిపించబోతున్నది. గతంలో నిహారిక కొణిదెల నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్‌సిరీస్‌లో సంగీత్ శోభన్ లీడ్ రోల్ చేశాడు.
Also Read- Saiyaara OTT Date: ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైన ‘సయారా’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!


