Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభసంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది.. వెంకీమామ కామెడీ టైమింగ్ వేరే లెవెల్..!

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ వచ్చేసింది.. వెంకీమామ కామెడీ టైమింగ్ వేరే లెవెల్..!

విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు సాంగ్స్ రిలీజ్ అవగా.. సూపర్ సక్సెన్ ను అందుకున్నాయి. ఇక తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్. నిజామాబాద్ లోని సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మూవీ టీమ్ అంతా ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు రిలీజ్ చేసారు.

- Advertisement -

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఓ కిడ్నాప్ కేసు బయటకు వస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని.. వాళ్లను కాపాడటానికి ఎక్స్ పోలీస్ అయిన వెంకటేష్ ని తీసుకురావడానికి మరో లేడీ పోలీస్ (మీనాక్షి) ని పంపిస్తారు. అయితే అప్పటికే పెళ్లి అయిన వెంకటేష్ లైఫ్ లోకి వచ్చాక భార్య, మాజీ ప్రేయసి మధ్యలో వెంకీమమ పాత్ర ఎలా నలిగిపోతాడు అన్నదే స్టోరీ అన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇంతకీ కిడ్నాప్ కథేంటి అని సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉంది. వెంకీమామ కామెడీ టైమింగ్ సినిమాలో వేరే లెవెల్ లో ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్వకత్వం వహిస్తుండగా.. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎంగేంజింగ్‌గా సాగే ఇంటర్య్వూలు, చార్ట్‌ బస్టర్‌ పాటలు, ఇంప్రెసివ్‌ ప్రోమోలు.. ఇలా ప్రతీ విషయం సినిమా చుట్టూ మంచి బజ్‌ క్రియేట్ చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News