విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunam) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానియికలుగా, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్‌బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.
కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వసూలు చేసి వసూళ్ల సునామి సృష్టించింది. ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఈ హక్కులు దక్కించుకున్న జీ5 ప్రకటించింది. మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగుతో పాటు జీ5 ఓటీటీలోనూ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ సినిమాలోని ఓటీటీ వెర్షన్‌లో థియేటర్‌లో మిస్ అయిన కొన్ని కామెడి సన్నివేశాలను కూడా యాడ్ చేసినట్లు తెలుస్తోంది.