విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో 15 రోజుల్లోనే రూ.300కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది.
ఈ మూవీ విడుదలై మూడు వారాలు పూర్తి కావొస్తున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.303 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. అంతేకాకుండా ఓ రీజినల్ ఫిల్మ్ ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిందని తెలిపింది.

ఇక ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు హీరోయిన్లగా నటించగా.. వీవీటీవీ గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించగా.. భీమ్స్ సంగీతం అందించారు.