Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభSankranthiki Vasthunnam: ఆకట్టుకుంటున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో పాట

Sankranthiki Vasthunnam: ఆకట్టుకుంటున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ రెండో పాట

Sankranthiki Vasthunnam|విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కతున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇప్పటికే విడుదలైన ‘గోదారి గట్టు మీద రామ సిల‌క‌వే’ పాట శ్రోత‌ల‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ‘మీనూ..’ అంటూ సాగే ఈ పాట విన‌సొంపుగా ఉంది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పాడారు.

- Advertisement -

ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం వినూత్నమైన ముక్కోణపు క్రైమ్‌ కథాంశంతో రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న సినిమాని విడుదల చేయనున్నారు. కాగా వెంకీ-అనిల్ కాంబోలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News