Friday, January 17, 2025
Homeచిత్ర ప్రభSankranthiki Vasthunnam: సింగిల్ హ్యాండ్ వెంకీ.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’

Sankranthiki Vasthunnam: సింగిల్ హ్యాండ్ వెంకీ.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చింది. దీంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.100కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది.

- Advertisement -

తొలి రోజు రూ.45 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించగా.. రెండో రోజు రూ.32 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టటగా.. మూడో రోజు రూ.29 కోట్ల మొత్తాన్ని క‌లెక్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.106 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘ఎనీ సెంట‌ర్‌, సింగిల్ హ్యాండ్ విక్ట‌రీ వెంకటేష్’ అంటూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం సంక్రాంతి సెల‌వులు మరో మూడు రోజులు ఉండ‌డంతో ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్లు సాధించే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

కాగా వెంకీ, అనిల్ కాంబోలో వ‌చ్చిన ‘ఎఫ్‌2’, ‘ఎఫ్ 3’ తర్వాత ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు క‌థానాయిక‌లుగా న‌టించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News