క్యారావాన్స్, మేకప్, గ్రాఫిక్స్ పెద్దగా లేని టైంలో సీనియర్ యాక్ట్రెసెస్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంత గాడ్జియస్ గా కనిపించేవారో. మరి అలాంటి ఎస్టర్ ఇయర్ తెలుగు హీరోయిన్స్ ను కలుసుకోవాలంటే? ఎవరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉండదు? అందుకే మనం అలాంటి స్టాల్ వర్ట్స్ ను రెగ్యులర్ గా ఇలా నెమరేసుకుంటున్నాం. ఈ సండే సెలబ్రిటీ బ్యూటిపుల్ సరిత.
ఆన్ స్క్రీన్, బిహైడ్ స్క్రీన్
క్లాసిక్ అండ్ కల్ట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన డేరింగ్ యాక్ట్రెస్ సరిత. చాలామందికి సరిత ఫేవరెట్ హీరోయిన్. పైగా ఇప్పటికీ ఆమె సౌత్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తూనే ఉంటారు. నల్లకలువ అని ఆమెను సౌత్ ఇండస్ట్రీస్ సగౌరవంగా పిలుస్తాయి. ఆమె యాక్టింగ్ స్కిల్ అండ్ వాయిస్ అమేజింగ్. సరిత తెరపైన, తెరవెనుక కూడా టాలెంటెడ్ స్టార్. మహేష్ బాబు సినిమా అర్జున్ లో లేడీ విలన్ గా యాక్ట్ చేసిన లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టే సరిత అని మనం యువతరానికి గుర్తుచేస్తే వాళ్లు కూడా ఆమె ప్రశంసలతో ముంచెత్తుతారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ వైఫ్ ఆండాళ్ గా సరిత ఇరగదీసే విలనీ చూపారు.
బాలచందర్ ఇంట్రడ్యూస్ చేసిన తార
పాపులర్ డైరెక్టర్ కే బాలచందర్ లెక్కలేనంతమంది కొత్త టాలెంట్ కు తెరంగేట్రం చేయించారు. వారిలో సరిత కూడా ఒకరు. కన్నడ, తమిళ్, తెలుగు, మళయాళంలో సరిత బాగా పాపులర్ యాక్ట్రెస్. తన కో యాక్టర్ అయిన ముఖేష్ ను సరిత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. మళయాళం యాక్టర్ గా ముఖేష్ పనిచేశారు. వీరికి ఇద్దరు కొడుకులు. భర్త ముఖేష్ తో సరిత విడిపోయి ఇప్పుడు దుబైలో సెటిల్ అయ్యారు. ఏవైనా సినిమా ఛాన్సులు ఉంటే అవి తనకు నచ్చితే యాక్ట్ చేస్తున్నారు. లేదంటే రిటైర్మెంట్ ను ఎంజాయ్ చేస్తున్నారు సరిత. నిజం చెప్పాలంటే ప్రెజెంట్ గా సరిత సింపుల్ అండ్ పీస్ఫుల్ లైఫ్ స్పెండ్ చేస్తున్నారు. దుబైలో ఉన్న సరితకు చాలా సినిమా ఆఫర్స్ రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. కానీ తన ఇద్దరు కొడుకులతో టైం స్పెండ్ చేసేందుకు ఆమె ప్రయారిటీ ఇస్తున్నారు. అందుకే అన్ని సినిమాలనూ ఓకే చేయటం లేదని కోలివుడ్ మీడియా చెబుతోంది.
విజి చంద్రశేఖర్ సిస్టరే
మీకు విజి చంద్రశేఖర్ తెలిసే ఉంటారు కదా. సరిత సిస్టరే ఈ విజి చంద్రశేఖర్. తెలుగులోనూ ఒకటి రెండు సినిమాల్లో విజి హీరోయిన్ గా యాక్ట్ చేశారు. మళయాళం మాత్రం ఈమె చాలా పాపులర్ యాక్టర్. విజి ఇప్పుడు తమిళ్ సీరియల్స్ లో ఫుల్ బిజీగా ఉన్న యాక్టర్. విజి కూతురు అంటే సరిత సిస్టర్ కూతురు హీరోయిన్ గా పనిచేస్తున్నారు. లోవెలిన్ చంద్రేశఖర్ విజి కూతురు. ఇక హీరోయిన్గా డబ్బింగ్ ఆర్టిస్టుగా సరిత రెండు చేతులా సంపాదించారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. మంచి మంచి క్యారెక్టర్సే వచ్చాయి. ఎంతైనా ఫస్ట్ సినిమా మరో చరిత్రతోనే ఆమె సినిమా చరిత్ర స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ పైగా అప్పటికే టాప్ హీరో అయిన కమల్ హాసన్ తో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకోవటం ఇంకా గొప్ప. ఇవన్నీ కాక హీరోయిన్ గా మంచి చాలెంజింగ్ రోల్ లో తన సత్తా చాటారు సరిత. ఫస్ట్ సినిమా ఇంత క్రేజీ ప్రాజెక్ట్ కావటం అంటే ఆమె అదృష్టం. ఇక సరిత సౌత్ మొత్తం ఏలేంత స్టార్ డం సంపాదించటం ఖాయమని అంతా అనుకున్నారు. పైగా మల్టీ టాలెంటెడ్ సరితను చూస్తే ఎవరికైనా ఇలాంటి ఇంప్రెషనే వస్తుంది కూడా.
అభిలాష డైరీ
సరితకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా పెద్దది. మీకో విషయం చెప్పాలి సరితకు డైరీ రాసే అలవాటుంది. పైగా వాటిలో ఆమె నిజాయితీగా చాలా విషయాలు రాసుకున్నారు. అభిలాష అనే పేరుతో సరిత డైరీ ఉంటుంది. అభిలాషలో సరిత స్వయంగా రాసుకున్న రియల్ లైఫ్ పై చాలా ఇంట్రెస్టింగ్ విషయాలే ఉన్నాయి. మొదట్లో తాను చాలా అమాయకురాలినని ఆమె రాసుకున్నారు. కానీ ఆతరువాతగానీ లోకం పోకడ తెలిసి రాలేదని డైరీలో ఉందట. ఇవన్నీఆమె క్లోజ్ ఫ్రెండ్స్ రివీల్ చేసిన విషయాలే. మొదట్లో అంత పెద్ద ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నా ఆతరువాత ఫ్రెండ్స్ బాగా తగ్గిపోయారట. పైగా ఎవరితోనైనా ఫ్రీగా మనసు విప్పి మాట్లాడదామంటే భయం వేసేదట సరితకు. సరిత బాగా లావుండేవారు, మొదట్లో ఏదిపడితే అది తినేసేవారు. ఎప్పుడపడితే అప్పుడు నిద్రపోయేవారు. కానీ సినిమాల్లోకి వచ్చాక పూర్తిగా మారిపోయారట. డే అండ్ నైట్ పనిచేసేవారట. ఎన్నో ప్రెజర్స్ కూడా ఆమె ఫేస్ చేయాల్సి వచ్చినట్టు డైరీలో ఉంది.
ప్యాన్ ఇండియా స్టార్ @ 160 మూవీస్
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో కలిపి 160కు పైగా సినిమాల్లో సరిత యాక్ట్ చేశారు. ఫిల్మ్ ఫేర్ తోపాటు నంది అవార్డులు కూడా ఆమె గెలుచుకున్నారు. సరితకు సౌత్ లో ఫ్యాన్ బేసే చాలా పెద్దది. జస్ట్ ఆమె గొంతు వినగానే అరే సరిత అంటారు. అంత పెద్ద ఇమేజ్ ఉంది సరితకు. మరో చరిత్ర సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు సరిత. ఆతరువాత బాలచందర్ డైరెక్షన్ లో ఆమె పర్మినెంట్ ఆర్టిస్ట్ అయ్యారు. బాలచందర్ డైరెక్షన్లో ఏకంగా 23 సినిమాల్లో ఆమె యాక్ట్ చేశారంటే ఇంక్రెడిబుల్ కదా. బలచందర్ కు బాగా నచ్చిన హీరోయిన్స్ లో సరిత ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.
గోరింటాకుతో డబ్బింగ్
ఇలా బిజీ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగా మారారు. దాసరి డైరెక్షన్లో వచ్చిన గోరింటాకు సినిమాలో సుజాతకు డబ్బింగ్ చెప్పింది మన సరితనే. అయితే విచిత్రం ఏంటంటే తన గొంత అంత బాగుంటుందని తనకే తెలియదట. ఇక మరోచరిత్ర సినిమాలో డబ్బింగ్ చెప్పద్దని బాలచందర్ అన్నారట. అయితే తనకు ఫస్ట్ ఫిలిం కూడా కావటంతో డబ్బింగ్ ఎలా చెప్పాలో కూడా తెలియదు. కానీ రికార్డింగ్ ఇంజినీర్ మాత్రం సరిత వాయిస్ బాగుందని డైరెక్టర్ బాలచందర్ ను ఒప్పించారట. అలా ఫస్ట్ సినిమా నుంచే డబ్బింగ్ చెప్పటం డబ్బింగ్ నేర్చుకోవటం స్టార్ట్ చేశారు సరిత. ఆతరువాత డబ్బింగ్ టెక్నిక్ నేర్చుకున్నట్టు సరిత ఇంటర్వ్యూల్లో స్వయంగా చెబుతారు.
సరిత పేరుతో ఓ చట్టం ఉంది
మీకు తెలుసా సరిత పేరుతో ఓ చట్టం వచ్చిందని. ఆమె రెండుసార్లు మ్యారేజ్ చేసుకున్నారు. సెకెండ్ మ్యారేజ్ ముఖేష్ అనే యాక్టర్ ను. కానీ అంతకు ముందు అంటే ఫస్ట్ మ్యారేజ్ మాత్రం డ్రామా యాక్టర్ చలంను ఆమె పెళ్లి చేసుకున్నారు. కానీ సంవత్సరం తిరక్కుండానే వీళ్లు డైవర్స్ తీసుకున్నారు. వీరి డైవర్స్ చాలా పెద్ద స్టోరీ అందుకే తమిళనాడులో డైవర్స్ యాక్ట్ లో సరిత అనే చట్టమే వచ్చింది. ఇక రెండో మ్యారేజ్ డైవర్స్ అయ్యాక కూడా సరిత కాంట్రవర్సీల్లో చిక్కుకున్నారు. సరితతో విడాకులు తీసుకున్న ముఖేష్ మరో ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఓ క్లాసికల్ డ్యాన్సర్ తోముఖేష్ పెళ్లి జరిగిందని తెలిసి సరిత కోర్టుకెక్కారు. అయితే సరిత-ముఖేష్ వివాహం డైవర్స్ తో ముగిసింది కాబట్టి సరిత కేసు ఓడిపోయింది. దీంతో తీర్పు విన్న సరిత కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయింది. ఆతరువాత ఆమె పర్సనల్ లైఫ్ లో చాలా టెన్షన్స్ లో కూరుకుపోయారు.
రీల్ లైఫ్ రియల్ లైఫ్ స్టోరీ
అందుకే సరిత రీల్ లైఫ్ ను రియల్ లైఫ్ తో కంపేర్ చేస్తే గ్లామర్ ఇండస్ట్రీలో ఉండే వాళ్లు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఆమెకు కూడా తప్పలేదనిపిస్తుంది. సరిత చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోయిన్. అప్పటికే ఆమె చాలా మోడరన్ డ్రెస్సెస్ లో తళుక్కుమన్నారు. స్కిన్ షో చేయటం ఈమెకు పెద్ద చాలెంజ్గా అనిపించలేదు. చెప్పేందుకు లావున్నా చాలా ఈజీగా గ్లామ్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు సరిత. అగ్నిసాక్షి వంటి సినిమాలు సరిత కెరీర్ ను పెద్ద మలుపులే తిప్పాయి. ఆతరువాత చాలా పెద్ద హీరోలతో ఆమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి మంచి హిట్స్ కొట్టారు. సెల్వీ వంటి తమిళ్ సీరియల్స్ లో కూడా సరిత తన సత్తా చాటారు. ఇండస్ట్రీలో పెద్ద స్టార్ డం ఎంజాయ్ చేసే టైంలోనే ఆమె 10 ఏళ్లపాటు లాంగ్ బ్రేక్ తీసుకుని తన ఇద్దరు కొడుకులను పెంచి పెద్దచేశారు. ఈ టైంలో ఆమె స్క్రీన్ పైన కనిపించలేదు కానీ బిహైండ్ ద స్క్రీన్ డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ కంటిన్యూ చేశారు. డబ్బింగే కెరీర్ గా 1979 నుంచి 1989 వరకు ఆమె బిజీ మదర్ ఉండిపోయారు.
బాలచందర్ కు ఫేవరెట్
సరిత బాలచందర్ కు ఎంత ఫేవరెట్టో చెప్పాలంటే ఆమె బాలచందర్ దగ్గర 23 సినిమాల్లో పనిచేశారని చెబితే సరిపోదు. మరో చరిత్ర సినిమా కోసం బాలచందర్ ఆడిషన్స్ మీద ఆడిషన్స్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయనకు నచ్చిన అమ్మాయి మాత్రం దొరకలేదు. ఆ క్యారెక్టర్ కు సూట్ అయ్యే అమ్మాయి దొరికే వరకూ ఆయన షూటింగ్ స్టార్ట్ చేయలేరు. దీంతో 162 మంది అమ్మాయిలను బాలచందర్ ఆడిషన్స్ చేశారు. ఆ తరువాతనే ఆయనకు సరిత దొరికారు. కమల్ తో కలిసి సరిత ఆడిషన్స్ లో బాలచందర్ ఇంప్రెస్ అయ్యారు. అప్పుడే మరో చరిత్ర మెమోరబుల్ హిట్ గా నిలిచిందన్నమాట. సైజ్ జీరో సినిమాలో లీడ్ రోల్ కోసం..ప్రోస్తెటిక్ మేకప్ కు నో చెప్పి నాచురల్ గా యాక్ట్ చేసేందుకు అనుష్క షెట్టీ ఏం చేశారు. రియల్ గా వెయిట్ పెరిగారు. ఈ ఎక్స్ పెరిమెంట్ సరిత ఎప్పుడో చేశారు. అంటే 90స్ లోనే సరిత ఈపని చేశారు. మిసరీ అనే హాలీవుడ్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1990లో దీనికి ఆస్కార్ కూడా వచ్చింది. ఈ సినిమాను జూలీ గణపతి అని తమిళ్ లో రీమేక్ చేశారు. దీనికోసం సరిత విపరీతంగా లావు అయ్యారు. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆతరువాత మళ్లీ ఆమె కష్టపడి బరువు తగ్గారు. యాక్టింగ్ అంటే సరిత అంత మనసుపెట్టి, కష్టపడి, ఇష్టపడి చేసేవారు.
బెస్ట్ స్టార్ ఫర్ 3 టైమ్స్
తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చే బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును మూడుసార్లు గెలిచారు. సరిత. కలైమామణి అనే అత్యున్నతమైన అవార్డు కూడా సరిత సొంతమైంది. అగ్నిసాక్షితో ఆమెకు కలైమామణి దక్కింది. సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో సరిత యాక్ట్ చేశారు, ఆమెకు చాలా భాషలు వచ్చు. తమిళ్, ఇంగ్లీష్, తెలుగు ఆమె చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడతారు. గుంటూరు జిల్లాకు చెందిన మునిపల్లి అనే గ్రామానికి చెందిన తెలుగు ఫ్యామిలీలో ఆమె పుట్టారు. కాబట్టి ఆమె మదర్ టంగ్ తెలుగు. కానీ చెన్నైలో పెరిగారు కాబట్టి ఆటోమేటిక్ గా తమిళ్ వచ్చు.
మీకు అసలు విషయం అంటే సరిత రియల్ లైఫ్ సీక్రెట్ ఒకటి చెప్పాలి. సరిత అసలు పేరు సరిత కాదు. అభిలాష ఆమె ఒరిజినల్ పేరు. అంటే సరిత అనేది ఆమె స్క్రీన్ నేమ్. అందుకే ఆమె అభిలాష పేరుతో డైరీ రాసుకున్నారు. అభిలాష మునిపల్లి ఆమె అసలు పేరు, పూర్తి పేరు. డైరెక్టర్ కే బాలచందర్ అభిలాష పేరును సరితగా మార్చి ఆమెను లాంచ్ చేశారు మరోచరిత్రలో. మీరు గణేష్ పాత్రో పేరు వినే ఉంటారుగా. పాపులర్ రైటర్ ఆయన సరిత ఫాదర్ కు మంచి ఫ్రెండ్ కూడా. ఈ గణేష్ పాత్రోనే సరితలో మంచి యాక్ట్రెస్ దాగున్నారని కనిపెట్టిన ఫస్ట్ పర్సన్. అందుకే సరితను మరోచరిత్ర ఆడిషన్స్ కు వెళ్లమని గణేష్ చెప్పారు. బాలచందర్ గాడ్ ఫాదర్ గా ఉండగా ఆమె సౌత్ స్టార్ గా ఎదిగారు. అందుకే ఆమె అంటారు నాకు యాక్టింగ్ గురించి ఏం తెలీదు. నిజానికి ఎలాంటి ట్రైనింగ్ కూడా తీసుకోలేదు కానీ బాలచందర్ నాకు అన్నీ నేర్పారని సరిత చెబుతారు.
హీరోస్ డామినేటెడ్ ఇండస్ట్రీ
ఇప్పుడు సినిమాల గురించి సరిత నిర్మొహమాటంగా మాట్లాడతారు. ఇప్పుడు అంతా హీరోస్ డామినేటెడ్ ఇండస్ట్రీగా ఫిల్మీ వల్డ్ మారిపోయిందంటారు. తాను లావుగా, నల్లగా ఉన్నా మంచి పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ సినిమాల్లో తనకు ఆఫర్స్ రావటం చాలా గొప్ప అని ఆనందంగా చెబుతారు. బాడీ షేమింగ్ ఉన్న ఈరోజుల్లో ఇదంతా అసాధ్యమంటారు. ఒకవేళ తాను అందంగా ఉంటే తనకు జస్ట్ గ్లామ్ రోల్స్ మాత్రమే డైరెక్టర్స్ ఇచ్చేవారేమో అని తనమీద తనే జోక్స్ వేసుకుంటారు సరిత. షి ఈజ్ బోల్డ్ బోత్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్.
నగ్మా, విజయశాంతి, టబు, సుష్మితాసేన్, రమ్యకృష్ణ, సౌందర్య, సిమ్రన్, రోజా, రాధ, రాధిక, భానుప్రియ, ఆర్తి అగర్వాల్, మాధవి, నదియా, శరణ్య, అమల, రోషిణి, మధుబాల, అపర్ణ, శోభన, మీనాక్షి శేషాద్రి, మీనా, ఊర్వశి, ఆమని, స్నేహ వంటి హీరోయిన్స్ కు 1990ల్లో డబ్బింగ్ ఇచ్చింది సరితనే. ఇలా సరిత ఎవరికి డబ్బింగ్ చెప్పారో చెప్పుకుంటూపోతే చాలా పెద్ద లిస్ట్ వస్తూనే ఉంటుంది. హీరోయిన్ సుహాసిని చాలా మంది హీరోయిన్స్ కు డబ్బింగ్ ఇస్తారు. కానీ సుహాసినికి తొలి రోజుల్లో తెలుగులో డబ్బింగ్ చెప్పింది సరితనే. అమేజింగ్ కదా. సంసారం ఒక చదరంగం, చంటబ్బాయ్, లాయర్ సుహాసిని వంటి సినిమాల్లో మీకు సుహాసిని గొంతు కాదు సరిత గొంతే వినిపిస్తుంది. 6 ఫిల్మ్ ఫేర్, 6 నంది అవార్డ్స్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ తో పాటు సౌత్ లోని అన్ని రాష్ట్రాల గవర్నమెంట్స్ ఇచ్చే స్టేట్ ఫిలిం అవార్డ్స్ కూడా సరిత అందుకున్నారు.
తెలుగమ్మాయే అయినా ఛాన్సులు వచ్చాయి
తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళ్ వాళ్లు తమ సొంత మనిషిలా ఆమెను ఆదరించారు. ఆమెను తమిళ్ అమ్మాయిగా గుర్తించి సన్మానాలు చేశారు. అందుకే సరితను మనమంతా తమిళ్ అమ్మాయి అనుకుంటాం. డజన్లకొద్దీ కన్నడ, మళయాళం సినిమాలు చేసిన సరిత ఎక్కువ యాక్ట్ చేసింది మాత్రం తమిళ్ లోనే. ఆతరువాత తెలుగులో. 47 డేస్ అనే సినిమాలో ఆమె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. అన్నట్టు హీరోయిన్ గానే కాదు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా, విలన్ గా ఆమె ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇది చాలా రేర్ ఛాన్స్. మన తెలుగులో ఇలాంటి ఎంతోమంది తెలుగమ్మాయిలు తమ సత్తా చాటారు. కానీ ఈమధ్యకాలంలో
అంటే గత టూ డికేడ్స్ గా మాత్రమే తెలుగు వారికి కాకుండా వేరే లాంగ్వేజ్ వారికి మాత్రమే హీరోయిన్ గా మంచి ఛాన్సులు వస్తున్నాయి. ఇదో ట్రెండ్ అంతే. మళ్లీ సరితలాంటి తెలుగమ్మాయిలకు మన టాలీవుడ్ పట్టం కడుతుందేమో చూద్దాం.