Monday, May 19, 2025
Homeచిత్ర ప్రభSarva-Krithi onscreen romance is simply superb: శర్వా-కృతి కెమిస్ట్రీ అదుర్స్

Sarva-Krithi onscreen romance is simply superb: శర్వా-కృతి కెమిస్ట్రీ అదుర్స్

జూన్ 7న రిలీజ్

శర్వా-శృతి కెమిస్ట్రీ అదిరిపోయిందనేలా ఉంది ఈ యంగ్ కపుల్. ట్యూన్ తో పాటు శర్వానంద్, శృతి షెట్టీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ సూపర్బ్ గా ఉందని ఇది చూసినవారంతా అంటున్నారు. దీంతో సినిమాపై మంచి పాజిటివ్ మౌత్ టాక్ స్టార్ట్ అయింది.

- Advertisement -

ఇక తన చార్ట్‌బస్టర్ ఫామ్‌ను కొనసాగిస్తూ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరో సూపర్ హిట్ ఆల్బమ్‌ను అందించాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో డైనమిక్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘మనమే’ చిత్రం బ్యూటిఫుల్ ట్రాక్‌లతో అలరిస్తోంది. మొదటి పాట ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ రెండవ సింగిల్-మనమేని విడుదల చేశారు.

హేషామ్ అబ్దువల్ వహాబ్ స్కోర్ చేసిన టైటిల్ ట్రాక్ ఫుల్ లైఫ్, వైబ్రెంట్ గా ఉంది. పాటలోని ఎమోషన్, కంపోజిషన్, లిరిక్స్, విజువల్స్ అద్భుతమైన అనుభూతి ఇస్తోంది. లీడ్ పెయిర్- శర్వానంద్, కృతి శెట్టి ఇంతకు ముందు గొడవపడే వారు ఇప్పుడు మంచి అనుబంధంకు వచ్చారు. ఇది కొత్త ప్రారంభం. ప్రతి క్షణం వారికి కొత్త అనుభవం.

శర్వానంద్, కృతి శెట్టి చక్కని కెమిస్ట్రీని పంచుకున్నారు. ప్రేమ ప్రయాణంతో పాటు, ఈ పాట విక్రమ్ ఆదిత్య పోషించిన పిల్లవాడితో వారి బంధాన్ని కూడా చూపిస్తుంది. ఈ పాటకు ఆకట్టుకునే సాహిత్యం కృష్ణకాంత్ రాశారు, కార్తీక్, గీతా మాధురి గానం ఈ పాటకు అదనపు ఆకర్షణను జోడించింది. విజయ్ పోలాకి కొరియోగ్రఫీ చేశారు. శర్వానంద్ వేసిన మాప్ స్టెప్ అదిరిపోయింది. మనసుని హత్తుకునే ఈ టైటిల్ ట్రాక్ అన్ని మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ పొజిషన్ లో నిలిచింది.

విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రాఫర్లు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందించారు.

‘మనమే’ జూన్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News