Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSatya: ఆల్‌రౌండర్ సత్య కమెడియన్ టు సోలో హీరో!

Satya: ఆల్‌రౌండర్ సత్య కమెడియన్ టు సోలో హీరో!

Satya: సినిమాలో కొన్ని క్యారెక్టర్లు అలా వచ్చి, ఇలా వెళ్లిపోకుండా… ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి. కమెడియన్ సత్య విషయంలో అదే జరిగింది. 2019లో వచ్చిన క్రైమ్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా’లో సత్య పోషించిన ఏసుదాసు క్యారెక్టరుకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. తన కామెడీ టైమింగ్, అమాయకమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో సత్య ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. నిజం చెప్పాలంటే, సత్య ఉన్నంత సేపు ఆడియన్స్ సినిమాను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. అందుకే చాలా వరకు ఈ సినిమాకు ‘రిపీట్ వాల్యూ’ వచ్చింది.

- Advertisement -

ALSO READ: Michael: మైఖేల్ జాక్సన్ బయోపిక్.. మైఖేల్ జాక్సన్ మేనల్లుడు హీరో!

సత్య క్యారెక్టరుకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌ను దర్శకుడు రితేష్ రానా బాగా ఉపయోగించుకున్నాడు. ఆ హైప్‌ను దృష్టిలో ఉంచుకునే, ‘మత్తు వదలరా 2’ లో సత్యకు ఏకంగా ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చాడు. ఆ సినిమాలో సత్య, హీరో శ్రీ సింహాతో కలిసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా చేసిన కామెడీ యాక్షన్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అవ్వడంలో సత్య కామెడీ కీలక పాత్ర పోషించింది. ఆ సక్సెస్‌తో సత్య ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ కమెడియన్లలో ఒకరిగా మారిపోయాడు. చిన్న పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా, ఏ సినిమాలో సత్య ఉంటే ఆ కామెడీ సీన్లు పక్కా హిట్టే అనే గ్యారంటీ వచ్చింది.

ALSO READ: SSMB 29: రాజమౌళి ప్రతీ సినిమాకి కాపీ కొట్టడమే..

కమెడియన్‌గా టాప్ ఫామ్‌లో ఉన్న సత్య, ఇప్పుడు హీరోగా మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. తనకు ఈ స్థాయిలో గుర్తింపు, క్రేజ్ తీసుకొచ్చిన ‘మత్తు వదలరా’ డైరెక్టర్ రితేష్ రానాతోనే కలిసి హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కానుంది. రితేష్ రానా స్టైల్లో ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం సత్య ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad