Sunday, June 16, 2024
Homeచిత్ర ప్రభSatyabhama: క్రైమ్ థ్రిల్లర్ లో కాజల్

Satyabhama: క్రైమ్ థ్రిల్లర్ లో కాజల్

బాలయ్య చేతులమీదుగా ట్రైలర్

గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఆడియన్స్ మనసు దోచుకోవటంలో ముందుంటారు. కానీ అలాంటి స్టోరీ లైన్, డైలాగ్స్, మంచి యాక్టర్స్ బృందం ఉంటే ఇలాంటి సినిమాలు ఎప్పుడూ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తాయి. అయితే మేజర్ సినిమాతో మంచి హిట్ అందుకున్న శశికిరణ్ తిక్క ఈసారి మరోమారు అలాంటి క్రైమ్ జోనర్ లోనే తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దీంతో సహజంగానే శశి సమర్పిస్తున్న కొత్త సినిమాపై కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పుట్టుకొచ్చేసాయి. సత్యభామ అనే ఈ కొత్త సినిమాకు మరింత బజ్ అండ్ హైప్ తెచ్చేందుకు బాలయ్యను రంగంలోకి దించారు డైరెక్టర్ శశి.

- Advertisement -

ఈ నెల 24న నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ “సత్యభామ” సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. ‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.

“సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 24న హైదరాబాద్ లో నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా “సత్యభామ” సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. బాలకృష్ణ అతిథిగా వస్తుండటంతో “సత్యభామ” మూవీకి మరింత క్రేజ్ ఏర్పడటం ఖాయమని చెప్పుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News