Selvaraghavan: కార్తీ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన యుగానికి ఒక్కడు డిఫరెంట్ అటెంప్ట్‌గా ప్రేక్షకులను మెప్పించింది. థియేటర్లలో రిలీజైన సమయంలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఆ తర్వాత కల్ట్ క్లాసిక్‌గా పేరుతెచ్చుకుంది. ఏడాది క్రితం రీ రిలీజ్ చేయగా… రికార్డ్ కలెక్షన్స్ దక్కించుకుంది. యుగానికి ఒక్కడు మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల సెల్వ రాఘవన్ ప్రకటించాడు. కథ సిద్ధం చేసే పనిలో ఉన్నానంటూ వెల్లడించాడు.
ఈ సీక్వెల్ అనౌన్స్‌మెంట్ నుంచే సెల్వ రాఘవన్‌కు కొత్త కష్టాలు మొదలయ్యాయట. “ఎక్కడికి వెళ్లినా యుగానికి ఒక్కడు 2 అప్‌డేట్ చెప్పమని అడుగుతున్నారు. సీక్వెల్ షూటింగ్ ఎప్పుడని అంటున్నారు. ఈ ప్రశ్నలు విని విసిగెత్తిపోయానని” ఓ ఈవెంట్‌లో సెల్వ రాఘవన్ కామెంట్స్ చేశాడు. ఎంజాయ్‌మెంట్ కోసం ఏదైనా సినిమాకు వెళ్లినా ఆ మూవీ గురించి కాకుండా యుగానికి ఒక్కడు 2 గురించే అడుగుతున్నారని సెల్వరాఘవన్ అన్నాడు. ఈ ప్రశ్నల వల్లే బయటకు ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read – Agastya Nanda: హీరోగా ఎంట్రీ ఇస్తున్న అమితాబ్ మనవడు – నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో మూవీ
“ఈ సీక్వెల్‌ను అనౌన్స్ చేయకుండా ఉండాల్సిందని సెల్వరాఘవన్ పేర్కొన్నాడు. కార్తీ లేకుండా ఈ సీక్వెల్ సాధ్యపడదు. కార్తి ఒప్పుకున్నా అతడి డేట్స్ ఏడాది పాటు కావాలి, భారీ బడ్జెట్ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సీక్వెల్ చేయడం అసాధ్యమేనని.. సెల్వ రాఘవన్ చెప్పాడు. యుగానికి ఒక్కడు మూవీలో రీమాసేన్, ఆండ్రియా హీరోయిన్లుగా నటించారు. పార్తిబన్ కీలక పాత్ర పోషించారు. యాక్షన్ అంశాలకు హిస్టరీని జోడించి సెల్వరాఘవన్ మూవీని రూపొందించారు. తమిళంలో రిలీజ్ టైమ్‌లో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మాత్రం హిట్టు టాక్‌ను తెచ్చుకుంది.
దర్శకుడిగా తెలుగుతో పాటు తమిళంలో సినిమాలు చేశాడు సెల్వరాఘవన్, 7 జీ బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, పుదుపెట్టై వంటి విజయాలతో టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పరాజయాల కారణంగా గత మూడేళ్లుగా మెగాఫోన్‌కు దూరంగా ఉంటున్న సెల్వరాఘవన్ ప్రస్తుతం 7జీ బృందావన కాలనీ మూవీకి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం యాక్టర్‌గా బిజీ అయ్యాడు.
Also Read – Bahubali Epic: ప్రతి సెకన్‌కు గూస్‌బంప్స్ – బాహుబలి ఎపిక్ మూవీకి మహేష్‌బాబు కొడుకు రివ్యూ


