Peddi: రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోన్న పెద్ది మూవీ కోసం మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇటీవల రిలీజైన చికిరి సాంగ్‌తో పెద్దిపై ఉన్న హైప్ అమాంతం డబుల్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్, ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్.. అన్నింట్లో చికిరి సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. 24 గంటల్లోనే నలభై మిలియన్లకుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్‌ను క్రియేట్ చేసింది. చికిరి సక్సెస్‌తో పెద్ది టీమ్ కూడా ఫుల్ ఖుషీగా ఉందట. నెక్స్ట్ సింగిల్‌ను ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోన్నట్లు సమాచారం.
కాగా, పెద్ది మూవీపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శోభన ఓ కీలక పాత్రలో నటించబోతున్నదట. హీరో క్యారెక్టర్‌తో ఎమోషనల్ బాండింగ్ ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో శోభన కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. శోభన క్యారెక్టర్ లెంగ్త్ తక్కువే అయినా కథలో చాలా ప్రాధాన్యముంటుందని అంటున్నారు. చిరంజీవితో సినిమాలు చేసిన హీరోయిన్ అయితేనే పెద్దికి అడ్వాంటేజ్‌గా మారుతుందని భావించిన దర్శకుడు బుచ్చిబాబు సానా.. శోభనను ఎంపిక చేసినట్లు వినికిడి.
Also Read- Raghavendra Rao: నిహారిక కొణిదెలకు చేదు అనుభవం – సీనియర్ డైరెక్టర్‌ను ఆటాడుకుంటున్న నెటిజన్లు
పెద్ది సినిమాలో శోభన భాగం కావడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. గతంలో చిరంజీవి ‘రుద్రవీణ, రౌడీ అల్లుడు’ సినిమాల్లో శోభన హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. చిరంజీవి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శోభన.. చరణ్ మూవీలో ఎలాంటి క్యారెక్టర్‌లో నటించబోతుందన్నది అభిమానుల్లో ఇంట్రెస్టింగ్‌గా మారింది. గత ఏడాది రిలీజైన ప్రభాస్ కల్కి 2898 ఏడీతో చివరగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది శోభన.
కాగా పెద్ది మూవీ సెకండ్ సింగిల్ నవంబర్ 31న రిలీజ్ కానున్నట్లు సమాచారం. రామ్‌చరణ్ క్యారెక్టరైజేషన్‌ను వివరించే మాస్ సాంగ్‌ను ఈ సారి మేకర్స్ విడుదల చేయనున్నారట. పెద్ది సినిమాలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటించబోతున్నది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ 2026 మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read- Tamannaah: స్లిమ్‌గా కనిపించటానికి ఇంజెక్షన్స్.. తమన్నా రియాక్షన్


