Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభKushboo Sundar : న‌టి ఖుష్బూ ఇంట విషాదం

Kushboo Sundar : న‌టి ఖుష్బూ ఇంట విషాదం

Kushboo Sundar : సీనియ‌ర్ న‌టి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆమె సోద‌రుడు అబ్దుల్లా ఖాన్ క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో శ‌నివారం తుది శ్వాస విడిచారు. అన్న‌య్య మృతితో ఖుష్భూ శోక‌సంద్రంలో మునిగిపోయింది.

- Advertisement -

“మ‌న‌కు ఎంతో ఇష్ట‌మైన వాళ్లు ఎప్పుడూ మ‌న‌తోనే ఉండాల‌ని కోరుకున్న‌ప్ప‌టికీ ఎప్పుడో ఒక రోజు వారు దూరం అవుతారు. మా అన్న‌య్య జీవిత ప్ర‌యాణం ఈ రోజు ముగిసింది. ఆయ‌న చూపిన మార్గం, ప్రేమ ఎల్ల‌ప్పుడు మాతోనే ఉంటుంది. అన్న‌య్య కోసం ప్రార్థించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు. పెద్ద‌లు చెప్పిన‌ట్లుగా జీవిత ప్ర‌యాణాన్ని దేవుడే నిర్ణ‌యిస్తాడు. అన్న‌య్య ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా” అని ఖ‌ష్బూ సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసింది.

ఖ‌ష్బూ అస‌లు పేరు న‌ఖ‌త్ ఖాన్‌. సినిమాల్లోకి వ‌చ్చాక ఆమె ఖ‌ష్భూగా పేరు మార్చుకున్నారు. అబ్దుల్లా, అబూ బాకర్, అలీ అనే ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. వారిలో అబ్దుల్లా నేడు మ‌ర‌ణించాడు. ఈయ‌న కొన్ని సినిమాల్లో కూడా న‌టించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News