Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభShaakuntalam: శక్తి అంతా కూడగట్టుకుని వచ్చా..శాకుంతలం ప్రమోషన్ చేస్తా-సామ్

Shaakuntalam: శక్తి అంతా కూడగట్టుకుని వచ్చా..శాకుంతలం ప్రమోషన్ చేస్తా-సామ్

ఆరోగ్యం బాగాలేకపోయినా శక్తి అంతా కూడగట్టుకుని శాకుంతలం సినిమా ప్రోగ్రాంకు వచ్చినట్టు హీరోయిన్ సమంత చెప్పారు. అంతేకాదు.,శాకుంతలం ప్రమోషన్ లో కూడా పాల్గొంటానని చెప్పారు. సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేందుకు వచ్చిన సామ్..చాలా కాలం తరువాత కెమెరాల ముందుకు వచ్చారు. అడపాదడపా తప్ప ఆమె సోషల్ మీడియాలోనూ గతంలోలా ఎక్కువ యాక్టివ్ గా లేరు. మరోవైపు ఆరోగ్యం ఎలా ఉన్నా సినిమాపై తన ప్రేమను పదేపదే చాటుకుంటూ.. తన ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహపరుస్తున్నారు సామ్. అనారోగ్యంతోనే ఆమె శాకుంతలం సినిమా డబ్బింగ్ కూడా చెప్పటం హైలైట్.

- Advertisement -

ఈ ప్రోగ్రాంలో సమంత చాలా ఎమోషనల్ అయి.. ఏడ్చేశారు. డైరెక్టర్ గుణశేఖర్ కు తాను పాదభివందనం కూడా చేసినట్టు సామ్ చెప్పారు. సినిమా అంటేనే తనకు అత్యంత ఇష్టమైన విషయం అని బాధైనా, సంతోషమైనా సినిమానే అన్నీ తనకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాయని సామ్ చెప్పటం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక విజయ్ దేవరకొండతో సామ్ కలిసి చేస్తున్న ‘ఖుషీ’ సినిమా ఫ్యూచర్ ఏమిటో ఇప్పటికిప్పుడు సామ్ చెప్పకపోయినా..ఆ సినిమాను కూడా ఆమె కసితో పూర్తి చేస్తారని స్పష్టమవుతోంది. కానీ హాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులపై మాత్రం సమంతా ఇంకా ఎటు తేల్చటం లేదు. మరోవైపు మిగతా ప్రాజెక్టులన్నీ సమంత రిజెక్ట్ చేసి, నో చెప్పి, ట్రీట్మెంట్ తీసుకుంటోందనే టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News