Saturday, November 15, 2025
HomeTop StoriesKING: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ 'కింగ్' మూవీ గ్లింప్స్ వచ్చేసింది!

KING: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ గ్లింప్స్ వచ్చేసింది!

KING: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అభిమానులకు ఇది నిజంగా పెద్ద ట్రీట్ అని చెప్పాలి. ఎందుకంటే, షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా, తన నెక్స్ట్ మూవీ ‘కింగ్’ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. జవాన్ తో షారుఖ్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్ ఈ ‘కింగ్’ మూవీకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.

- Advertisement -

ఈ గ్లింప్స్‌ హై యాక్షన్ ఎలిమెంట్స్‌తో అదరహో అనిపిస్తోంది.
షారుఖ్ ఖాన్ కొత్త లుక్‌లో, ముఖ్యంగా వైట్ హెయిర్‌తో, స్టైలిష్‌గా, కనిపించడం ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. “సౌ దేశోం మే బద్‌నామ్, దునియా నే దియా సిర్ఫ్ ఏక్ హి నామ్ – కింగ్” అని షారుఖ్ చెప్పే డైలాగ్ కి గూస్‌బంప్స్ వచ్చాయి. గ్లింప్స్‌లో షారుఖ్ రౌడీలను కొడుతూ, స్టైలిష్‌గా కార్డ్ ని వెపన్ లాగా ఉపయోగించే సీన్ ఫ్యాన్స్ మెదడులో ఇంకా తిరుగుతూనే ఉంటుంది.

షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘పఠాన్’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందుకే ఫ్యాన్స్ లో ‘కింగ్’ మూవీ మీద విపరీతమైన హైప్ క్రియేట్‌ అవుతుంది. షారుఖ్ ఖాన్, అనిరుధ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా ‘జవాన్’ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలిసిందే. ఆ పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘జవాన్’ కి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్, తన టాలెంట్ చూసి, షారుఖ్ ఖాన్ బిగ్గెస్ట్ యాక్షన్ ప్రాజెక్ట్ అయిన ‘కింగ్’కి కూడా అనిరుధ్ ని మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ALSO READ: Janhvi Kapoor: పల్లెటూరి గెటప్స్‌లో జాన్వీ కపూర్ లుక్స్‌పై కామెంట్లు!

ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తుంది అని టాక్ వినిపిస్తున్నాయి. మొత్తానికి, ‘కింగ్’ గ్లింప్స్ చూస్తుంటే, షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు మరో బిగ్గెస్ట్ యాక్షన్ ట్రీట్ సిద్ధంగా ఉందని అర్థమవుతోంది!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad